Loading...

9, నవంబర్ 2011, బుధవారం

పున్నమి వెన్నెల                                 చక్కని శరదృతువు. ఈ ఋతువులొ వచ్చే రాత్రులని కవులు శారదరాత్రులని వర్ణిస్తూఉంటారు. చల్లని , తెల్లని వెన్నెల పున్నమి రోజు పూర్తిగా పెద్దగా విరబూసిన చంద్రసుమం కురిపించే కౌముది సుధలు. చంద్రుని నుంచి నిరంతరం అమృతం స్రవిస్తుందని భావుకులు అంటారు. సుధాకరుడనే పేరు కూడా చంద్రునిదేగా!సుధ అంటే అమృతం.

                       అబ్బ , చంద్రుని వెన్నెల కు ఎన్ని పేర్లున్నాయో కదా! మనమంతా అలవాటుగా పిలిచే వెన్నెల అనేపేరుతో బాటు, వెన్నెల, కౌముది, జ్యోత్స్న, చంద్రిమ, చంద్రిక  అన్నీ అందమైన పేర్లే.

                      ఇక ఈ వెన్నెలను మన బ్లాగర్లు ఎలా వదిలి పెడతారు. అందమైన వెన్నెల పేర్లు తమ బ్లాగులకు పెట్టేసుకున్నారు.

             ఈ పేర్లన్నీ చూద్దామా. (నాకు తెలిసినవి మాత్రమే, ఇంకా కొన్ని బ్లాగులు ఉండవచ్చు. వారు కూడా తమ పేర్లు చెప్పరూ !)

                             వెన్నెల, ఎన్నెల, వెన్నెల సంతకం, వెన్నెల్లో   గోదావరి   , చంద్రిమ, చందమామ చరిత్ర , చందు -నేనింతే. ఇంతే ..

అమ్మాయిలకు వెన్నెల పేర్లన్నీ సరిపోతాయి కదూ, జాబిలి పేర్లన్నీ అబ్బాయిలకు.

        చంద్రుడు వెన్నెల విడిపోనట్లు ప్రేమ ఉన్న ప్రేమికులు, దంపతులు విడిపోరు.
ఒక పాత పాట కూడా ఉంది సుమా- "వెన్నెలలెంతగ విరిసినగాని జాబిలిని విడిపోలేవులే...."

                               ఈరోజు ప్రయాణం ఉంది. వెన్నెల ను మిస్ అవుతున్నానే అనుకున్నాను కానీ ట్రైన్ లో వెళుతూ, అడవిలో గాచిన వెన్నెల ని చూడటం కూడా బాగుంటుందిగా అని తర్వాత అనిపించింది. తప్పకుండా చూస్తాను. చందమామతో మాట్లాడుకుంటాను హాయిగా...చల్లగా....

        పైన  వెన్నెలతో పాటు తారల్లా క్రింద భూమి మీద చక్కని చుక్కల్లాంటి అమ్మాయిలు నీటిలో కార్తీక దీపాల చుక్కలనూ ఈ వేళ  వెలిగిస్తారు. ఆ అందం చూడాల్సిందే.

14 వ్యాఖ్యలు:

 1. సుభా,
  ధన్యవాదాలండి. తప్పకుండా చెపుతాను. అంతవరకూ మన మధురవాణి చంద్రునితో చెప్పిన కబుర్లు చదువుతూ ఉండండి. :-))

  ప్రత్యుత్తరంతొలగించు
 2. కదిలే రైలు కిటికీ లో నుంచి , మనతో పాటు వచ్చే పున్నమి చంద్రుని చూడటం చాలా చక్కటి అనుభవం .
  మీ పున్నమి వెన్నెల కబురులు బాగున్నాయి .

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మాల గారు,
  ధన్యవాదాలండి. మీ వంటలు బాగున్నాయండోయ్.ట్రైన్ లోకి పట్టుకెళ్తా మరి.:-))

  ప్రత్యుత్తరంతొలగించు
 4. వెన్నెలంత చల్లగా ఉంది మీ టపా.. :)

  <<వెన్నెలలెంతగ విరిసినగాని జాబిలిని విడిపోలేవులే....

  వస్తాడు నా రాజు ఈ రోజు..
  రానే వస్తాడు నెలరాజు ఈ రోజు..
  కార్తీక పున్నమి వేళలో..
  కలికి వెన్నెల కెరటాల పైన...
  తేలి వస్తాడు నా రాజు ఈ రోజు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మందాకిని గారూ,
  సుభా గారికి మీరిచ్చిన రిప్లై కామెంట్ ఇప్పుడే చూసాను. అప్పుడెప్పుడో చందమామతో నేను చెప్పిన కబుర్లు మీకింకా గుర్తున్నాయా.. how sweet! థాంక్యూ! :))

  ప్రత్యుత్తరంతొలగించు
 6. అవును మరి, నిండు పున్నమి...పండు వెన్నెలా...వెన్నెల లోని వికాసమే వెలిగించెద నీ కనులా....అని ఎంత బాగా చెప్పారండి.

  మా అబ్బాయిల టైం పాస్ మూంపల్లి తీసుకెళ్ళరా మరి!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 7. బావుందండీ మందాకినీ గారూ...శరత్కాలపు వెన్నెల ప్రయాణం తోడుగా చంద్రుడుంటే చాలా బావుంటుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. వెన్నెల్లో గోదావరి అని నా బ్లాగ్ పేరు మీరే చెప్పేసారు.మీ పోస్ట్ బావుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. మందాకినీ గారూ..
  నా కామెంట్స్ రాలేదా మీకు? రెండు కామెంట్స్ రాసానే! :(

  ప్రత్యుత్తరంతొలగించు
 10. మధురవాణి గారు,
  ఆ పాట లో ఆ లైన్ నచ్చి అలా వ్రాశానన్నమాట.
  ఇక మీ వ్రాతలే అంత మధురంగా ఉంటాయన్నమాట. అందుకే గుర్తుండిపోతాయి.
  ఒక్కో సారి స్వీట్ ఎక్కువౌతుంది కదా , అప్పుడు చదవలేను మీ టపాలు. యు ఆర్ వెరీ స్వీట్ పర్సన్.

  మధురవాణి గారు,
  మీ వ్యాఖ్యలు వచ్చాయండీ. నేనే ఆలస్యంగా చూస్తున్నాను. ఊళ్ళో చూడటం పడలేదు. మన్నించెయ్యండేం ఈ సారికి....!
  మీకు మరీ మరీ ధన్యవాదాలండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. జయ గారు,
  మీ వ్యాఖ్య బాగుంది. ఆరాధనలో ఆ పాట, నీ చెలిమి....అనే పాట నాకు చాలా ఇష్టం.
  ధన్యవాదాలండీ.

  మూంపల్లి ....? ఏమిటండీ అర్థం కాలేదు నాకు.మూన్ పల్లి అంటున్నారా?

  ప్రత్యుత్తరంతొలగించు
 12. జ్యోతిర్మయి గారు,
  నా భావాల్ని చక్కగా అర్థం చేసుకున్నారు. ధన్యవాదాలండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. శైల బాల గారు,
  మీ బ్లాగ్ పేరు మర్చిపోగలమా? ధన్యవాదాలండీ.

  ప్రత్యుత్తరంతొలగించు