Loading...

8, నవంబర్ 2011, మంగళవారం

కొత్త సమస్యలు


                        బ్లాగ్ లో కొత్త సమస్యలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఎప్పుడూ ఏదో ఒకటి మాయమవుతూనే ఉంటుంది. ప్రస్తుతం నా వంట బ్లాగులో వ్యాఖ్య ఫారమ్ కానీ, ౦ వ్యాఖ్యలు అనే పదం కానీ కనిపించటం లేదు. పాత పోస్ట్ లో కొన్ని వచ్చిన వ్యాఖ్యలు కూడా మాయమయ్యాయి.

       సెట్టింగ్స్ లో కెళ్ళి వ్యాఖ్యలు చూపించు/దాచిపెట్టు లో చూపించు మళ్ళీ సెట్ చేసి, టెంప్లేట్ మొత్తంగా మార్చి  ఏం చేసినా మొరాయిస్తోంది.

                                 అయితే అదే బ్లాగులో కొన్ని టపాలకు ఈ సమస్య లేదు. ఈ రోజు రాసిన టపాకు , కొన్ని పాత టపాలకు ఈ సమస్య.

          మళ్ళీ ఇదే టెంప్లేట్ తో ఉన్న నా మరో బ్లాగ్ కు ఈ సమస్య లేదు. ఏంటో బ్లాగులు, ఈ మిథ్యాభిమానాలు, వీటి కోసం వెంపర్లాటలూ  వదిలేదెప్పుడో!


మిత్రులు తెలిసిన వాళ్ళెవరైనా కొద్దిగా సలహా ఇవ్వరూ!
అబ్బే మాకిదే పని మరి అంటారా? :-))

5 వ్యాఖ్యలు:

  1. అవునండీ..మాకిదే పనా :))
    హ్మ్..టెంప్లేట్ మార్చాలని చూసుంటారు. అవి థ్యాంక్స్ అనేసుంటాయి. లేదా ఆ పోస్టుకు నోకామెంట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వున్నట్లైతే ఇక ఆపోస్టువరకూ తరువాత కామెంట్స్ సెలక్షన్ మార్చినా ఉపయోగముండదు. నాకంతే తెలుసు :))

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ఏం చెయ్యను, పాపం ఓ వంద వ్యాఖ్యలైనా వచ్చేవి. పాపం వ్యాఖ్యాతలు :-))
    స్పందనకు ధన్యవాదాలండి.

    ప్రత్యుత్తరంతొలగించు
  3. ఈ టపా పాట్లు , కామెంటు కట్లు బాధ ఇంతింత కాదయా బ్లాగుదాబి రామ , వినుర గూగులన్నా !

    ప్రత్యుత్తరంతొలగించు
  4. జిలేబి గారు,
    కోరి తెచ్చుకున్న తలనొప్పేకదా ఈ బ్లాగులు అవీ.....:-)

    ప్రత్యుత్తరంతొలగించు
  5. ఈ సమస్య తీరిపోయిందోచ్! సమస్య ఎక్కడుందో కనిపెట్టేశాను. తీర్చేశాను.:))

    ప్రత్యుత్తరంతొలగించు