Loading...

25, అక్టోబర్ 2011, మంగళవారం

పద్యావళి


దీపము మార్గముఁ జూపును
రేపటి యుదయము వరకును రేయిని బహుధా
కాపుగ కావలి కాచును
దాపఱికమనునది లేక తన సొమ్మిచ్చున్.

అందము దీపపు రూపము
నందము తన కాంతులెపుడు నవనిని దానే
కుందుల వెలిగెను కాదా
చందురునికి మారుగ మఱి సాటిక లేదే!

వరుసగ వెలిగెను దీపపు
విరులిక విరిసెను గనుమిక వెన్నెలఁ బంచెన్.
కరములు బట్టెను బాలుడు
తరుణము తనకిది టపాసు దక్షిణ కోరెన్.
                     ---------లక్ష్మీదేవి

16 వ్యాఖ్యలు:

 1. అందము నీ పదసంపద,
  అందము భావప్రకటన, అందము కవితా
  నందము గూర్చెడి రచనలు!
  మందాకిని! నీ కివె శుభమందారమ్ముల్.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. గురువుగారు,
  నమస్కారములండి. మీ ప్రవేశముతో నా బ్లాగుకు దీపావళి వెలుగులు నిజంగానే వచ్చాయి.
  ధన్యురాలను.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. కందపు కుందుల వెలుగుచు
  అందపు కాంతులను పంచు, అద్భుతమౌ మీ
  చందన మౌన సుగంధము
  చిందెడు పద్యావళికిదె చేతును జోతల్!
  మీకూ...., మీ ఇంటిల్లిపాదికీ.. "దీపావళి" శుభాకాంక్షలు. ఏదో.. సరదా.. ఊహాతేటగీతి...మీ బ్లాగు మాధ్యమంగా పంచుకుందామని తట్టింది. స్వాగతిస్తారుగా........?
  సిరికి లోకాన పూజలు జరుగు వేళ
  చూడ వచ్చెను నింగిన చుక్కలన్ని
  ఏడ జాబిలి ఎటుపాయె లేడదేమి?
  భువికి దిగెనేమొ అక్కకై "దివిలె" వోలె!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. రాకుమారుడు గారు,
  మీ పద్యాలు, భావాలు చాలా బాగున్నాయి.
  అందరినీ ఇవే పద్యాలతో పలకరిస్తున్నారేం?
  ధన్యవాదములు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. రాకుమారుడు గారు,
  అద్భుతము మీ పద్యాలు , భావాలు!
  నిజంగా చాలా బాగున్నాయి.
  సి , జ కు మాత్రం యతి కుదరలేదు కానీ బహు చక్కటి ఊహ. అక్కకు జరిగే పూజలు చూసేందుకు తమ్ముడా నింగిని వదలి రావటం. చాలా బాగా చెప్పారు.
  ధన్యవాదములు.మీ అభిమానానికి ధన్యవాదములు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. నిజమేనండి. చప్పున చెప్పేశాను. మన్నించండి. మీ పద్యధారముందు నేనెంత?

  ప్రత్యుత్తరంతొలగించు
 7. pardon me.unable to write in telugu in ur blog by cut and paste. I donnot know poetry but know " kaMdaM ceppinavaaDE kavi, paMdini poDicinavaaDE baMTu.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. శర్మ గారు,
  కందం అందమైనదీ, ముచ్చటైనదీ నాకు నచ్చినదీనూ.
  మీరు వచ్చినందుకూ, మెచ్చినందుకూ ధన్యవాదాములు.
  మీరు చెప్పిన ఈ మాట ఎప్పుడూ వినలేదండీ!

  ప్రత్యుత్తరంతొలగించు
 9. వరుసగ వెలిగెను దీపపు
  విరులిక విరిసెను గనుమిక వెన్నెలఁ బంచెన్.
  చాలా చక్కగా కూర్చారండీ పదాలని.. ముఖ్యంగా ఈ వాక్యం నాకెంతో నచ్చింది. దీపపు విరులు వరుసగా వెలిగెను అని చాలా చాలా బాగుంది.. లేటుగా చెప్తున్నాను మన్నించాలి.. దీపావళి ' సుభా ' కాంక్షలు మీకు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. వరుసగ వెలిగెను దీపపు
  విరులిక విరిసెను గనుమిక వెన్నెలఁ బంచెన్.
  చాలా చక్కగా కూర్చారండీ పదాలని.. ముఖ్యంగా ఈ వాక్యం నాకెంతో నచ్చింది. దీపపు విరులు వరుసగా వెలిగెను అని చాలా చాలా బాగుంది.. లేటుగా చెప్తున్నాను మన్నించాలి.. దీపావళి ' సుభా ' కాంక్షలు మీకు.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. శుభ గారు,
  మీరు వచ్చారే పండుగకు మా బ్లాగింటికి . అందుకే సంతోషం. మన్నించటాలెందుకు గానీ మీ పేరు సుభనా శుభనా అయినా ప్రత్యేకంగా మీరు "సుభా"కాంక్షలని భలే చెప్తున్నారే? వెరైటీగా ఉంది.
  ధన్యవాదాలండీ మెచ్చుకున్నందుకు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. పేరు సుభాషిణి అండీ.. శుభాకాంక్షలు చెప్పేటప్పుడు నా పేరు తోనే చెప్తానండీ.. అంతకన్నా ఏమీ లేదండీ.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. ఓహ్ చక్కటి పేరు.
  నన్ను మా చిన్నాన్న మితభాషిణి అనేవారు. మీ పేరు పెట్టి పిలవాలని ఉంది. :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 14. "రేయిని బహుధా కాపుగ కావలి కాచును.." ఆహా! ఛందో బధ్ధంగా ఇంత చక్కని ఊహని పలికించిన మిమ్మల్ని ఏమని అభినందించాలో, సుభాషిణీ!

  ప్రత్యుత్తరంతొలగించు
 15. ఆహా కొత్తావకాయ గారు,
  "సుభాషిణి" ఇంతకన్నా చక్కని బిరుదు ఎవరికైనా ఉంటుందా?
  మీకు బో...ల్డు ధన్యవాదాలండి.

  ప్రత్యుత్తరంతొలగించు