Loading...

3, అక్టోబర్ 2011, సోమవారం

మెరుపులు, ఉరుములు

మనసు లోతుల్లోని అట్టడుగు పొరల్లో
మాయని మమతల జ్ఞాపకాలు

ఉన్నట్టుండి నీలాకాశంలో మెరుపులలో
కనిపిస్తున్నాయి, మురిపిస్తున్నాయి.

తవ్వి తీయకనే.., కోరకనే.........
మెరుపులు మురిపిస్తాయి, ముచ్చట గొల్పుతూ..


ఉరుములు  ధ్వనులే.....జడిపిస్తాయి.
మెలకువనీ, వాస్తవాన్నీ గుర్తు చేస్తూ ...

మెరుపులు, ఉరుములు  విడిపోవేమో.
శివశక్తుల్లా, వెలుగునీడల్లా.
               --------లక్ష్మీదేవి

3 వ్యాఖ్యలు:

 1. మెరుపులు, ఉరుములు విడిపోవేమో.
  శివశక్తుల్లా, వెలుగునీడల్లా చాలా బాగుంది.
  నాకయితే శివశ్చ హృదయం విష్ణుః విష్ణశ్చ హృదయం శివః అన్నట్టు అనిపించింది (ఇది నా పోలిక మాత్రమే సుమండీ!) ఉరుము మెరుపు కూడా అంతేనేమో!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. రసజ్ఞ గారు,
  అమ్మవారు విష్ణుస్వరూపమేనని, కాబట్టే మోహినిది అపురూప సౌందర్యమని, దుష్టశిక్షణ-శిష్టరక్షణ విషయంలో ఇద్దరూ ఒకే బాట అని శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఎన్నో ప్రసంగాలలో నిరూపించారు. కాబట్టి మీ పోలిక తప్పేమీ కాదు.
  అంతకుమించి అంతా ఒకే పరంజ్యోతి స్వరూపమని మూలాల్లోకి వెళ్తే తెలుస్తుందంటారు.

  ప్రత్యుత్తరంతొలగించు