Loading...

శుక్రవారం 30 సెప్టెంబర్ 2011

ఎందుకిలా???????

                        శరన్నవరాత్రుల గురించీ, బొమ్మలకొలువు గురించీ వ్రాశాను. స్నేహితులందరూ చూశారు. అభినందించారు.

             మన పండుగల గురించి వ్రాసుకోవటం సరే సంతోషంగా చేసుకోవటం ఉందా? ఎందుకు బయట పరిస్థితులన్నీ ఇలా ఉన్నాయి. తెలుగు దేశం (పార్టీకాదు) లో ఎందుకీ గొడవలు?ఎందుకిలా జరిగింది? చాలా బాధగా ఉంది. రెండు వైపుల వాళ్ళు తమ వాదనలు విడిచి పెట్టలేరు. రెండు వైపులలో నాదీ ఒక వైపు వాదనే.    కానీ......

                 కానీ వీటన్నిటినీ మించి బాధ ఏంటంటే అసలిదంతా లేకుండా అందరూ ప్రశాంతంగా ఎప్పుడుంటారు? ఒకరినొకరు తిట్టుకోవటం ఎప్పుడు ఆగుతుంది? ఈ రోజు  రెండు వైపులా నీళ్ళుపోసి పెంచుతున్న ద్వేషపు విష వృక్షం ఎంత పెద్దగా పెరుగుతుందో ఏమిటో? దీన్ని ఏ అగ్ని కాల్చి బూడిద చేయగలదు? అందరూ కలిసి నేను, నీవు కాకుండా మనము అని ఎప్పుడు అంటారు?

                    ఈ చెట్టు పైకీ కొమ్మలు పెంచుకుంటూ , క్రిందికీ వేళ్ళూనుకుంటూ ఎంత భయంకరంగా పెరుగుతోంది? అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ద్వేషం కుమ్మరించుకోవటం కాక, పూర్వీకులను కూడా పంచుకోవటం ...వాళ్ళు మా వాళ్ళు , వీళ్ళు మీవాళ్ళు అంటూ.....ప్చ్...

4 వ్యాఖ్యలు:

మధురవాణి చెప్పారు...

హుమ్మ్! :(

మాలా కుమార్ చెప్పారు...

ఈ గొడవలన్నీ ఎప్పుడాపుతారో ఏమో !

కొత్త పాళీ చెప్పారు...

true.

మందాకిని చెప్పారు...

మధురవాణి గారు,
మాలాకుమార్ గారు,
కొత్తపాళీ గారు,
ప్రశ్నలే గానీ సమాధానాలు కనుచూపుమేరలో కనిపించటం లేదే?!?!