Loading...

22, సెప్టెంబర్ 2011, గురువారం

ముందడుగు

కలగానే మిగులుతుందేమో
అలుపెరుగని పోరాటం
అలలా నిరాశ ఉవ్వెత్తున ఎగసి భయపెడుతుంటే
పులకింతల పున్నములెప్పుడో
మలుపులు తిరిగిన బ్రతుకు నడక
అలసట తీరేదెన్నడో
శిలగా మారిన హృదయాలు
కదిలేదెప్పుడో
చలనమంతా ముందడుగు వేసేందుకే
కదిలేదెప్పుడో!

కలవరమెంతున్నా ,
కలం ఆగినా కాలం ఆగదు.
            ----లక్ష్మీదేవి

4 వ్యాఖ్యలు:

  1. Interesting.
    ఈ కింది వాక్యం అబ్బురపరిచింది.
    అలలా నిరాశ ఉవ్వెత్తున ఎగసి భయపెడుతుంటే
    పులకింతల పున్నములెప్పుడో
    పున్నమికి సముద్రం పోటెక్కడం, అలలు చెలరేగడం ప్రకృతిలో జరిగేది. ఇక్కడ నిరాశ అలగానూ, పులకింత పున్నమిగానూ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. కొత్తపాళీ గారు,
    ధన్యవాదాలండి.
    సముద్రంలో పుట్టే అల సముద్రాన్ని ముంచేయదు. సముద్రపు భావావేశాలను ప్రతిబింబిస్తుందేమో బహుశా.. అది ఎలా ప్రకృతి సహజమో..... మానవప్రకృతి (స్వభావం) సహజంగా మనస్సాగరాన్ని, మమతల సాగరాన్ని ఆటుపోట్లకు గురిచేస్తుంది. అలల్లా భావావేశాలు ప్రదర్శింపబడతాయి. కానీ సాగరానికి తట్టుకునే శక్తి ఉన్నట్టుగా మనిషికి, మనస్సాగరానికి ఉంటుందా? రెండూ ప్రకృతి లోంచే వచ్చినా రెండింటి సామర్థ్యాలు ఒక్కటి కాదుగా?
    సంతోషం, ఆశాభావం ఇచ్చే పులకింతే మనస్సాగరానికి పున్నమి కాదా!

    ప్రత్యుత్తరంతొలగించు
  3. నిరాశా,నిస్పృహ,నిర్వేదం
    నిరంతర సాధకునికి ఆమడదూరం
    అలుపెరుగని పోరాటానికి
    శిఖరమెత్తు ఆరాటం కావాలి

    హృదయం శిల్పిచేతిలోశిలైతే
    చలనం శిల్పానికెందుకు?
    ఆ సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు
    ఆ ముగ్ధమోహన హృదయాన్ని తిలకించేందుకు
    కాలంతో కదులుతాయి ఎదుటివాడి కాళ్ళు
    నీ సంకల్పానికి సహాయంగా.

    ప్రత్యుత్తరంతొలగించు
  4. @భాస్కర రామి రెడ్డి
    "అలుపెరుగని పోరాటానికి
    శిఖరమెత్తు ఆరాటం కావాలి"

    ఈ వాక్యాలు బాగా నచ్చాయి. ఇప్పుడు రెండూ కలిపి సంభాషణలా ఉంది కదూ! మరీ మరీ ధన్యవాదాలండి.

    ప్రత్యుత్తరంతొలగించు