Loading...

6, సెప్టెంబర్ 2011, మంగళవారం

ముత్యాల జల్లులుమాడం పట్టింది. అంటే మబ్బు పట్టిందీ ఆకాశంలో అని అర్థం. చల్లని గాలి వీచింది.

                        మాడమేమో పందిరేసిందన్నమాట. చల్లని గాలేమో పందిట్లో పన్నీరు జల్లుల్లా సువాసన వ్యాపింపజేస్తూన్నదన్నమాట.గాలి పెద్దగైంది. చెట్లన్నీ ఎలా ఊగుతున్నాయో! చేతులు రెండూ బాగా చాపి , చిన్నపిల్లలు రైమ్స్ కు పెద్ద స్టెప్స్ లేకుండా ఊరికే చేతులూపుతారే అలా............ చేతులు రెండూ బాగా చాపి, ఇలా...ఇలా. ....ఆడుతున్నాయి. బహుశా...

                రా..........రమ్మని ....రారా............రమ్మని  వానల్ని పిలుస్తున్నాయా అన్నట్టు........

                                వచ్చేసింది వాన. ఆకాశవరుడు భూవధువుకు  మబ్బులపందిరిలో తలంబ్రాలు స్తాంబాణం తో ఎత్తి పోస్తున్నట్టుగా ............పెద్ద వాన...ఎంతబాగుందో. పందిట్లో అందరూ అక్షింతలు చల్లుతుంటే పెళ్ళిని సంతోషంగా  చూస్తున్నవాళ్ళ తలల మీద పడినట్టు...అన్ని చెట్లమ్మల మీదా , మాన్లయ్యల మీదా చినుకులు పడుతున్నాయి. తల ఇలాఅనేస్తూ , ఊపేస్తూ విదిలించుకుంటూ ముసిముసి గా నవ్వుతున్నాయి.....

                   మాఇంటిముందు వేపచెట్టు ఎంత ఆనందంగా ఊగుతూ ఉంది!         మాకాంపౌండ్ గోడకు ఆనుకుని ఉన్న వేపచెట్టు కొంచె అటువైపుంది. మా ఫ్లాట్స్ ఎదురుగా ఉన్న ఇంటిగోడ నానుకుని ఉన్నవేపచెట్టు సరిగా మా బాల్కనీ ఎదురుగా ఎత్తుగా పెరిగి కొమ్మలు విస్తరించుకుంది. ఇంకా చిన్నదే...ఒక రెండేళ్ళో మూడేళ్ళో ఉంటాయేమో.....ఎంత హుషారుగా ఆడుతోందో.........ఈ మధ్య పెళ్ళిళ్ళలో అమ్మాయిలు హిందీ సీరియల్స్ లోలా బాగా వర్క్ చేసిన గుజరాతీ గాగ్రాచోళీ గానీ, మన లంగా పైట లు గానీ వేసుకుని బోల్డన్ని మెరిసిపోయే నగలు పెట్టుకొని, అబ్బాయిలేమో మంచి వర్క్ ఉన్నవీ, లేనివీ షేర్వాణీలు వేసుకుని భలే డాన్స్ లు చేస్తున్నారుగా . అబ్బాయిలు తక్కువే. అమ్మాయిల గుంపు మాత్రం చేస్తుంటారు.


                        అటువైపు న్న ఇంటి చూరునించీ (అదే కారు షెడ్ కోసం ఒక ప్లాస్టిక్ టాప్ ) వరుసగా ధారలు ...........వెనుక ఉన్న లైట్ వెలుతురులో ...........ముత్యాల జల్లుల్లాగా...................కురుస్తున్నాయి.

ముత్యాల జల్లు కురిసె.........రతనాల మెరుపు మెరిసె.............వయసూ మనసూ పరుగులు దీసె...........హమ్మమ్మో అనే పాట రేడియోలో విన్నగుర్తు....

4 వ్యాఖ్యలు:

 1. టపా బాగుంది, మాంచి ఉక్కలో చదివానేమో వర్షం కురిసినంత చల్లగా అనిపించింది.
  మాడం అంటే మబ్బని కొత్త విషయం తెలిసింది. ధన్యవాదములు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. వర్షం కురిసిన అనుభూతి కలిగింది ఈ పోస్ట్ చదివాక
  బావుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఇంతటి ప్రసిద్ధ రచయిత్రి బాగుందంటే ....చాలా చాలా సంతోషమండి. మీకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు