Loading...

21, ఆగస్టు 2011, ఆదివారం

కృష్ణప్ర్రేమ




ప్రేమంటే?
ప్రేమంటే ఏమిటో మనసులో అదేదో తెలియని భావనా?
ఒకరి పట్ల మనం చెప్పలేని, వదులుకోలేని, వదలి సంతోషంగా ఉండలేని గొప్ప భావనా?
ఒకరి కోసం మిగతావన్నీ వదిలేయటమా?
ఒకరికోసం నిరంతరం శ్రమపడి అన్నీ సమకూర్చటమా?
ఆ ఒకరిని ఎప్పుడూ బాధపెట్టకపోవటమా?
ఆ ఒకరిని ఎప్పుడూ తన సంతోషం కోసం వాడుకోవటమా?
ఆ ఒకరిని ఎప్పుడూ మోసం చేయకపోవటమా?
ఇది ఆడ మగ / ప్రేయసీ ప్రియుడు/ భార్య భర్త అనే కాదు అందరి మధ్య ఉండే ప్రేమ గురించి ఇదే సందేహమే, ఇదే సందిగ్ధతే
తల్లీ కొడుకు, తండ్రీ కూతురు, అన్నా చెల్లెలు, అక్కాతమ్ముడు, స్నేహితులు, అక్కాచెల్లి, అన్నాదమ్ముడు ఎవరి మధ్యైనా సరే.
ఒకరి గొప్పదనాన్ని ఒకరు ఎల్ల వేళలా గుర్తించటమా?
ఒకరిని ఎల్లవేళలా తనకన్నా ఏ ఒక విషయంలో నైనా తక్కువైనా ప్రేమిస్తున్నానని చెపుతూ త్యాగాన్ని చూపుకోవటమా?
ఒకరిని నిరంతరం ధ్యానించటమా?
ఒకరి కోసం తనను తాను పూర్తిగా మరచిపోవటమా?
ఒకరి కోసం తన జీవితాన్నో, వృత్తినో, పిల్లల భవిష్యత్ నో బలి ఇవ్వటమా?
ఒకరిని తన కోసం అంటూ ప్రేమలో నో మొహమాటంతోనో బలవంతంగానో నిర్బంధించటమా?
ఏంటి ప్రేమంటే??????
ఇవన్నీ చేయటం కాదు. ఏ ఒక్కరూ వీటిలో అన్నింటినీ చేయరు, చేయలేరు. కానీ విషాదం ఏమిటంటే ఇవే మాధ్యమంగా ప్రేమ ప్రకటించబడుతోంది. లేదా వాదించ బడుతోంది. నేనిలా చేశాను చూడు నాకు నీమీద ఎంత ప్రేమో! నీకు నేనిలా చేయలేదు చూడు నాకు నీమీద ఎంత ప్రేమో! అని చెప్పబడుతోంది.
ఇన్ని రకాలుగా ప్రకటించనక్కరలేకుండా ఒకరి మనసు ఒకరికి తెలిస్తే.......
అది ఎలా?
:
:
:
:
అదే గోపికా కృష్ణుల ప్రేమ...............యశోదా కృష్ణుల ప్రేమ..!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

2 వ్యాఖ్యలు: