Loading...

శనివారం 18 జూన్ 2011

మనసాయెరా మాధవా!

మనసాయెరా మాధవా!

మగువను నే మగువను
మొగసాలకు నే రాలేనురా!


మధుమాసమ్మిది గనవేమిరా!
మధువులు గొన మరులే లేవా?

మరిచితివా నను మరిమరినీవే
తలచితివా ఇటు రార నా సామి

మాయని మమతల గురుతుల
మనసున నింపగ తరలిరారా!

మదిముంగిలిలో స్వాగతమిడ
నే నిలిచి యుంటినే గనవేమి రా?

-లక్ష్మీదేవి


2 వ్యాఖ్యలు: