ఊయలూగెనేమిదీ
తీయని గతకాలం
మాయని గురుతుల పెన్నిధీ
చేయని మధుపాకం || ఊ ||
పూలజడల కోరికలు వదినల పరిహాసాలు
చేలవెంట పరుగులు పేరంటపు మురిపాలు
చెరగని యీ జ్ఞాపకాల
మరుగునవీ ఆనందాలు || ఊ ||
తమ్ములపై కోపాలు అటువెంటనేఅనుతాపాలు
మిద్దెలెక్కి పంచుకున్న పెరుగన్నం ముద్దలు
చక్కని యీ అనుభూతులు
లెక్కకు అందని బహుమతులు || ఊ ||
--------లక్ష్మీదేవి
తీయని గతకాలం
మాయని గురుతుల పెన్నిధీ
చేయని మధుపాకం || ఊ ||
పూలజడల కోరికలు వదినల పరిహాసాలు
చేలవెంట పరుగులు పేరంటపు మురిపాలు
చెరగని యీ జ్ఞాపకాల
మరుగునవీ ఆనందాలు || ఊ ||
తమ్ములపై కోపాలు అటువెంటనేఅనుతాపాలు
మిద్దెలెక్కి పంచుకున్న పెరుగన్నం ముద్దలు
చక్కని యీ అనుభూతులు
లెక్కకు అందని బహుమతులు || ఊ ||
--------లక్ష్మీదేవి
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి