
శిశిరభామిని పాత ఆకుల వలువల్ని వదిలేసి, చివురుటాకుల క్రొత్త చీర కట్టి వసంతరాయనికై వేచి చూస్తూ ఉంది.
శిశిర వసంతాల అనురాగఫలితమే మనకు సరి క్రొత్త ఉగాది గా కనువిందు చేస్తుంది.
తన భామిని ని మరువలేక వసంతుఁడు గ్రీష్మ రూపం దాలుస్తాడు. కంటనీరు పెట్టుకుంటాడేమో మరి, వర్షంలో జగమే తడిసిపోతుంది.
చేమంతాల చెలి హేమంత, తన సఖుడైన శరత్తునితో కలిసి వచ్చి వసంతుని రాయబారం అతని చెలికి చేరుస్తుందనే అనిపిస్తుంది.
ఇంకేముంది,
ప్రతీ యేడూ శిశిరానికి వసంతమే.
వసంతునికి సంతోషమే.
రసహృదయాలకి ఆనందమే!!
-లక్ష్మీదేవి
madhuram, madhura,
ప్రత్యుత్తరంతొలగించుధన్యవాదాలండి.
ప్రత్యుత్తరంతొలగించు