తెలుగుబిడ్డ నీవు తెలుగుగడ్డ నీది!
తెలతెలవారే వచ్చే వెలుగంటి భాష నీది!
చిలకపలుకు చందాన పనికిరానిచదువులేల?
మేధను పెంపొందింపక కాగితాలు నింపనేల?
మన భాషపై వైముఖ్యం పరభాషపై మోహమిది.
ఆదిలోనే తుంచివేసె ఆలోచనా శక్తినిది!
అమ్మకైన కమ్మగా కమ్మ రాయునేర్పు ఏది?
విశ్వాన్నబ్బురపరిచే వైజ్ఞానిక ఘనత ఏది?
రెంటికి చెడ్డ రేవడిమైనామని తెలుసుకో!
దీపం ఉన్నది ఇపుడే ఇల్లు చక్కదిద్దుకో!
-లక్ష్మీదేవి
తెలతెలవారే వచ్చే వెలుగంటి భాష నీది!
చిలకపలుకు చందాన పనికిరానిచదువులేల?
మేధను పెంపొందింపక కాగితాలు నింపనేల?
మన భాషపై వైముఖ్యం పరభాషపై మోహమిది.
ఆదిలోనే తుంచివేసె ఆలోచనా శక్తినిది!
అమ్మకైన కమ్మగా కమ్మ రాయునేర్పు ఏది?
విశ్వాన్నబ్బురపరిచే వైజ్ఞానిక ఘనత ఏది?
రెంటికి చెడ్డ రేవడిమైనామని తెలుసుకో!
దీపం ఉన్నది ఇపుడే ఇల్లు చక్కదిద్దుకో!
-లక్ష్మీదేవి
వావ్.. మందాకిని గారూ చాలా బాగుంది. స్ఫూర్తినిచ్చే కవిత.
ప్రత్యుత్తరంతొలగించుధన్యవాదాలండీ!
ప్రత్యుత్తరంతొలగించుచాలా బాగున్నదండీ మందాకినీ గారూ! ఫిబ్రవరి 21 మాతృభాషా దినోత్సవం.ఆ సదర్భంగా ఏదైనా ఒక స్ఫుర్తివంతమయిన వ్యాసం రాసే ఆలోచన చేయ కూడదూ! చేస్తే మీ బ్లాగ్ లో పెట్టినప్పుడు నాకు దయచేసి గ్తెలియ చేయ గలరు ! మంచి గేయకవిత వినిపించినందుకు ధన్యవాదాలు మ్యాడం!
ప్రత్యుత్తరంతొలగించుధన్యవాదాలండీ!
ప్రత్యుత్తరంతొలగించుతప్పకుండా ప్రయత్నిస్తాను. భాషాభిమానమే తప్ప భాషాజ్ఞానం పెద్దగా లేదండీ.
నాకు తెలిసినంతలో మాతృభాషాదినోత్సవం సందర్భంగా నా మనసులో మాటలు పంచుకునే ప్రయత్నం చేస్తాను.
Very true.
ప్రత్యుత్తరంతొలగించుI'm not able to find your blog in koodali.
మాధురి గారు,
ప్రత్యుత్తరంతొలగించునిన్న సాయంకాలం నా బ్లాగే కాదు, ఏ సంకలినిలోనూ ఏ బ్లాగూ ఓపెన్ కాలేదు. ఈవేళ ఆ సమస్య లేదు.చూడండి.
ఆఁ.. అన్నట్టు కూడలిలో అన్ని బ్లాగులూ అన్న చోట నొక్కి, 11 వజాబితాలో చూస్తే మాలతీమాధవం కనిపిస్తుందండీ.