Loading...

26, నవంబర్ 2010, శుక్రవారం

జడివాన..

చినుకులలో..........
తడిసీ తడవని..
తనువులలో..... .....
విరిసీ విరియని..
పెదవులలో.........
మెరిసీ మెరవని..
సొగసులలో..........
మురిసే బంగరు..
మనసులలో.........
ఎగిరే రెక్కల..
ఊహలలో.............
మెదిలే తుంటరి..
ఆశలలో................
వెన్నెల కాంతుల..
వాగులలో.......
కలిసిన జంటల సరదాలు!!
సుమమూ భ్రమరం విలాసాలు!!
-మందాకిని