తెల్లారి ఆరు గంటలయ్యీ అవకముందు..... చల్లని మలయమారుతమన్నట్టు గా పవనవీచికలు. కొద్ది సేపట్లోనే చిటపట చినుకులతో వర్షం ప్రారంభమయ్యింది.
బాల్కనీలో కూర్చుని అలా చూస్తుంటే చూస్తూ... ఉండి పోవాలనిపిస్తోంది. వర్షపు ధారలకు తడుస్తున్న ప్రకృతి పరవశాన్ని తదేకంగా తిలకిస్తూ ఉంటే ఏదో మైమరుపు లాంటిది. ఊహూ(.... మైమరుపు అంటే ఇది కాదు.
మేఘాలను చూస్తే ఉల్లాసంతో పురి విప్పి నాట్యం చేసే నెమళ్ళలా వర్షం లో అభ్యంగన స్నానం చేస్తూ కొబ్బరిచెట్టు కొమ్మలన్నీ ఊపుతూ నర్తిస్తున్నట్టు కన్పిస్తోందే ....అదీ మైమరుపు అంటే....
జేసుదాసు సంగీత కచేరిలో అమృతాస్వాదన లో మైమరిచిన బాలుగారిలా గంభీరంగా తల ఊపుతున్నట్టు భారంగా కొమ్మలను కదిలిస్తున్న వేప చెట్టుదీ మైమరుపు అంటే....
మిగిలిన జీవరాశిలా కలుగుల నుంచీ కాంక్రీటు మిద్దెల వరకూ బంధింపబడకుండా ఎండను, వానను, చలిని మనసారా, తనువారా ఆహ్వానిస్తూ, ఆస్వాదిస్తూ, ఆరాధిస్తూ భూమండలాన్నే ప్రత్యేకంగా తీర్చిదిద్ది, పరిరక్షించే వృక్ష జాతికి మనం ఏం చేస్తున్నాం?
రాతివనాల నిర్మాణాలకై హరిత వనాలను నిర్మూలిస్తున్నాం.
అందుకే మానవ జాతి తరఫున వృక్ష జాతిని తలవంచి క్షమాపణ వేడుతూ.....
మందాకిని .
బుధవారం 9 జూన్ 2010
మంగళవారం 8 జూన్ 2010
తొలి వలపే తీయనిది ...... మదిలో మిగిలిన గాయమిది..
తొలి వలపే తీయనిది .....
ఊహల్లో విహారాలే!
గుండెల్లో సరాగాలే!
పూలల్లో విలాసాలే!
వెన్నెల్లో వసంతాలే!
కళ్ళల్లో కోలాటాలే!
శ్వాసల్లో స్వరాలేలే!
చూపుల్లో కయ్యాలేలే!
మాపుల్లో వినోదాలే!
మాటల్లో మోమాటాలే
మౌనాల్లో మర్మాలేలే!
మరులంటే ఆనందాలే!
కురిసేటి మరందాలే!
**************************************************************************************ఊహల్లో విహారాలే!
గుండెల్లో సరాగాలే!
పూలల్లో విలాసాలే!
వెన్నెల్లో వసంతాలే!
కళ్ళల్లో కోలాటాలే!
శ్వాసల్లో స్వరాలేలే!
చూపుల్లో కయ్యాలేలే!
మాపుల్లో వినోదాలే!
మాటల్లో మోమాటాలే
మౌనాల్లో మర్మాలేలే!
మరులంటే ఆనందాలే!
కురిసేటి మరందాలే!
....మదిలో మిగిలిన గాయమిది..
మధురోహలన్నీ మాయమాయే!
మరుగాయెలే సరాగాలే!
పూబాలలే విలపించేనే!
వెన్నెలరేయి వియోగాలే!
కన్నుల ఉబికే కన్నీరేలే!
శ్వాస శ్వాసలో నిట్టూర్పులే!
చూపులన్నీ నీకై వెతికే!
మాపటేల మనోవ్యధలే
మాటలన్నీ మౌనాలాయే
మౌనాలెంచే జ్ఞాపకాలే!
మరుభూమీ జీవితము!
కడవరకూ పెనుభారము!
-లక్ష్మీదేవి.
లేబుళ్లు:
నా రాతలు
6
వ్యాఖ్యలు
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)