Loading...

28, మే 2010, శుక్రవారం

చందమామా!

చెట్టుచాటున చందమామా
బెట్టు చాలిక వెలికి రామ్మా!!

పెట్టుకున్న దిష్టిచుక్క
పుట్టుమచ్చగ మిగిలిఉన్నా
ఒట్టు నీకది కొత్త పచ్చ
బొట్టుకన్నా అందగించేనే!!

పిట్టలమ్మల నాగమంటూ
చిట్టి ఊయలలూగమంటూ
గొరువంకల నాడరమ్మని
నెలవంక చందమైనావే!!

రేతిరంతా వెన్నెలెంతో
పంచి పంచి అలసినావో
సందె లోని చీకటంతా
తుంచి తుంచి తరిమినావో!!

-మందాకిని.

26, మే 2010, బుధవారం

వనిత... లత... కవిత

రచన :వేటూరి
చిత్రం : కాంచన గంగ
గాయకుడు: ఎస్.పి బాలు
*********************పాటను వినడానికి ఇక్కడ నొక్కండి  
ఈ లంకెలో ఉన్న నాలుగు పాటల్లో ఈ పాట ఎంచుకుని "పాడు" నొక్కాలి. (సెలెక్ట్ చేసి ప్లే నొక్కాలి)
వనిత... లత... కవిత
మనలేవు లేక జత!!
వనిత... లత... కవిత
మనలేవు లేక జత!!

ఇవ్వాలి చేయూత...
మనసివ్వడమే మమత..మనసివ్వడమే మమత..!!

వనిత... లత... కవిత
మనలేవు లేక జత!!

పూలు రాలి.. నేలకూలి తీగబాల సాగలేదు..
చెట్టు లేక.. అల్లుకోక.. పువ్వు రాదు.. నవ్వలేదు!
మోడు మోడని తిట్టుకున్నా... తోడు విడిచేనా?
పులకరించే.. కొత్త ఆశ, తొలగిపోయేనా!!
వనిత... లత... కవిత
మనలేవు లేక జత!!

ఆదరించే ప్రభుత లేక.. కావ్య బాలా నిలువలేదు..
కవిత ఐనా.. వనిత ఐనా, ప్రేమ లేకా పెరగలేదు!
చేదు చేదని తిట్టుకున్నా...చెలిమి విడిచేనా?
చేదు మింగి... తీపి నీకై, పంచ మరిచేనా!!
వనిత... లత... కవిత
మనలేవు లేక జత!!

తనది అన్నా..గూడు లేకా కన్నెబాలా బతుకలేదు..
నాది అన్న తోడు లేకా.. నిలువలేదు విలువలేదు!
పీడ పీడని తిట్టుకున్నా... నీడ విడిచేనా!
వెలుగులోన..నీడ లోన, నిన్నుమరిచేనా!!
వనిత... లత... కవిత
మనలేవు లేక జత!!

23, మే 2010, ఆదివారం

"నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన"

"వేణువై వచ్చాను భువనానికి...గాలినై పోతాను గగనానికి"
"నందికొండ వాగుల్లో నల్లతుమ్మ నీడల్లో చంద్ర వంక కోనల్లో సందెపొద్దు చీకట్లో"
యమునా తీరం....సంధ్యా రాగం నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో
"తెల్లావు కదుపుల్లో కర్రావులుండవా ...కర్రావు కడుపునా ఎర్రావు పుట్టదా
"సూర్యుడైనాచలవ చంద్రుడైనానింగి చుక్కలైనాఅష్ట దిక్కులైనానువ్వైనా నేనైనానీవైనా అహ నావైనా
సంద్రాన మీనాల చందమే"
"మమ్మీ పోయి డాడీ వచ్చే"
"ఆరేసుకోబోయి పారేసుకున్నానుకోకెత్తుకెళ్లింది కొండగాలి"
"అచ్చెరువున అచ్చెరువున(ఆ+చెరువున)"..."ఆబాలగోపాలము ఆ బాలగోపాలుని
"ఏ బీ సీ రాని ఏబ్రాసిరో వాడు ఓ అంటే ఢం రాని సన్నాసిరో"
"అరబిక్ కడలందం
"సిగలోకి పూలంటే అరటిపువ్వు తెస్తాడు"
మానసవీణ మధుగీతం
శంకరా నాద శరీరా పరా
బృందావని ఉంది
ఈ దుర్యోధన దుశ్శాసన
పావురానికి పంజరానికి
ఓడను జరిపే ముచ్చట కనరే
ఉప్పొంగెలే గోదావరి
కన్నుల పొంగేను కావేరి గొంతున పలికెను సావేరి ఈ నిశీధి లో రగిలే నా హృదయం...
ఆకాశాన సూర్యుడుండడు సందెవేళకు, చందమామ కు రూపముండదు తెల్ల వారితే... ఈ మజిలి మూడూ నాళ్ళే ఈ జీవ యాత్ర లో..
వందనాలు వందానాలు వలపుల హరి చందనాలు
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో
అలా మండిపడకే జాబిలి చలి ఎండ కాచె రాతిరి
అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక అలక చాలింక
స్వాతి చినుకు సందె వేళలో లేలేత వలపు వణుకు అందగత్తెలో
ఆకాశ దేశాన ఆషాడ మాసాన మెరిసేటీ వో మేఘమా...
రవి వర్మకే అందని....
ఎవరికెవరు ఈ లోకం లో ఎవరికి ఎరుక ఏదారెటు పోతుందో ఎవరిని అడగక
ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని
భారతనారీ చరితము.. మధుర కథా భరితము..
జగములేలిన వాని సగము నివ్వెరబోయె,. సగము మిగిలిన వాని మొగము నగవైపోయె… ఎరుక కలిగిన శివుడు ఎరుకగా మారగా..
కృష్ణా తరంగాల సారంగ రాగాలు
కృష్ణలీలా తరంగిణీ భక్తి గీతాలు
సస్య కేదారాల సరస గాంధర్వాలు
సరస హృదయక్షేత్ర విమల గాంధర్వాలు…
ఏటిలోని అలల వంటి.. కంటిలోని కలలు కదిపి.. గుండియలను అందియలుగ చేసి... తకిట తధిమి తందానా..
చుక్కా నవ్వవే.. నావకు చుక్కానవ్వవే...
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే..
"యమహా నగరి..కలకత్తా పురి..
మనసు ఉంటే మార్పు దాకా మార్గముందీ చలో
"జగడజగడజగడానందం
"అ అంటే అమలాపురం"
"ప్రియా ప్రియతమా రాగాలు"
"నవరస సుమ మాలికా"
"నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన"
"అందంగా లేనా? అసలేం బాలేనా?"
"కాలుతున్న కట్టేరా, చచ్చేనాడు నీ చెలి",
"ఆరేసుకోబోయి పారేసుకున్నాను"
"ఎన్నోరాత్రులొస్తాయి కానీ రాదే వెన్నెలమ్మ"
వయస్సునామి తాకెనమ్మి"
"నవమి నాటి వెన్నెల నీవు....
చేరువైనా రాయబారాలే..చెప్పబోతే మాటమౌనం..
మేఘమాలనంటుకున్న ఆంటెనాలతో – మెరుపుతీగ మీటి చూడు తందనాలతో
చిలిపియాత్రలో చల్ చల్ చల్ చల్ జరుపమందిలే జంతర్ మంతర్
అనుబంధమంటేనె అప్పులే కరిగే బంధాలన్నీ మబ్బులే హేమంత రాగల చేమంతులే వాడిపోయే…
మనోనేత్రం, అక్షర శిక్షలు, రాత గీత, రామ శాంతి, అనేకవచనం, భావనాంతరంగం, అంతర్వాహిని, పక్కింటబ్బాయి(మాపక్కింటోళ్ళకి) - ఈ బ్లాగు మిత్రులందరూ ఉదహరించిన పాటలు ఇక్కడ పెట్టాలనిపించింది. అందరికీ ధన్యవాదాలతో......