Loading...

8, జనవరి 2010, శుక్రవారం

ఆవోగే జబ్ తుమ్ ఓ సాజ్ నా

"జబ్ వి మెట్" చిత్రంలోని " ఆవోగే జబ్ తుమ్ ఓ సాజ్ నా " అనే మంచి పాటకి అదే రాగంలో భావానువాదం చేశాను.
చిత్తగించండి. ఇది కేవలం నేను రాశాననే ఆనందం నా మిత్రులతో పంచుకోటానికే తప్ప ఏ ప్రయోజనాన్ని ఆశించి కాదని మనవి చేసుకుంటున్నాను.

నీ రాకతో......నే..మధుమాసమే
ఓ చెలీ....నా తోటలోనే...
కురిసేను తే......నె, కురిసేను తేనె చిరుజల్లుగా....
కలిసే....ఈ మదిని ఆమది... (నీ రాకతో)

కవ్వించే కాటుక కనులేలే
దోచేసే నా మది నీవేళే
రాసేనే లేఖలు వేవేలు
చేసేనే బాసలు ఏవేవో
కలిసేనులే......ఈ వనినే.....ఆమని....
కురిసేను తే......నె, కురిసేను తేనె చిరుజల్లుగా....
కలిసే....ఈ మదిని ఆమది...
(నీ రాకతో)

జాబిల్లి తోడుగ ఈ రేయి
నీవల్లే నా మది మురిసేనే
సాగేనే నీ కనుసన్నల్లో
చుక్కల్లా మెరిసేటి చూపుల్లో
కలలెన్నో మరి.....చిగురించేనిలా...
కురిసేను తే......నె, కురిసేను తేనె చిరుజల్లుగా....
కలిసే....ఈ మదిని ఆమది...
(నీ రాకతో)