Loading...

28, అక్టోబర్ 2010, గురువారం

...కలిసుండాలన్నాడు

మాపటేల వచ్చినాడు మనసున్న నా మామ
మల్లె మొగ్గవన్నాడు మాలచ్చిమివన్నాడు
మొగుడూ పెళ్ళాలమింక మొగమాటమెందుకన్నడు...

అమ్మ,నాయన జూసుకున్నవ్ వచ్చినోళ్ళనాదరించేవ్
మనువాడిన మనిసికెంతొ పేరు దెచ్చినావన్నడు
కష్టసుఖం పంచుకుంట కాపురాన తీపి జూపి
కలకాలం ఇట్టాగే కలిసుండాలన్నాడు


బుజ్జిగాడి నూరడించు అమ్మవంటె నీవే
మొనగాడిని మురిపించు బొమ్మవంటె నీవే
అన్నాడు మెచ్చాడు అందాల నా మామా
మాటలింక వెయ్యేల అందేనే చందమామ
-మందాకిని.

6 వ్యాఖ్యలు:

 1. మీ రచనేనా? చాలా చాలా బావుంది లలితంగా

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అక్షరాలా నా రచనేనండీ.
  ఎంతమాటనేశారు?
  రచయితలు మెచ్చుకున్నారంటే గొప్పగా ఉంది. మీకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అయ్యో క్షమించాలి. కించపరిచే ఉద్దేశంతో కాదు, ఒక్కోసారి జనాలు తమకి నచ్చిన పాటలు పెడుతూంటారు, అందుకని అడిగా.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మీరు మరీనూ! వదిలేయండి గురువుగారూ!

  ప్రత్యుత్తరంతొలగించు