Loading...

9, జూన్ 2010, బుధవారం

వర్షంలో సంగీత నాట్య ఝరులు

తెల్లారి ఆరు గంటలయ్యీ అవకముందు..... చల్లని మలయమారుతమన్నట్టు గా పవనవీచికలు. కొద్ది సేపట్లోనే చిటపట చినుకులతో వర్షం ప్రారంభమయ్యింది.

బాల్కనీలో కూర్చుని అలా చూస్తుంటే చూస్తూ... ఉండి పోవాలనిపిస్తోంది. వర్షపు ధారలకు తడుస్తున్న ప్రకృతి పరవశాన్ని తదేకంగా తిలకిస్తూ ఉంటే ఏదో మైమరుపు లాంటిది. ఊహూ(.... మైమరుపు అంటే ఇది కాదు.

మేఘాలను చూస్తే ఉల్లాసంతో పురి విప్పి నాట్యం చేసే నెమళ్ళలా వర్షం లో అభ్యంగన స్నానం చేస్తూ కొబ్బరిచెట్టు కొమ్మలన్నీ ఊపుతూ నర్తిస్తున్నట్టు కన్పిస్తోందే ....అదీ మైమరుపు అంటే....

జేసుదాసు సంగీత కచేరిలో అమృతాస్వాదన లో మైమరిచిన బాలుగారిలా గంభీరంగా తల ఊపుతున్నట్టు భారంగా కొమ్మలను కదిలిస్తున్న వేప చెట్టుదీ మైమరుపు అంటే....

మిగిలిన జీవరాశిలా కలుగుల నుంచీ కాంక్రీటు మిద్దెల వరకూ బంధింపబడకుండా ఎండను, వానను, చలిని మనసారా, తనువారా ఆహ్వానిస్తూ, ఆస్వాదిస్తూ, ఆరాధిస్తూ భూమండలాన్నే ప్రత్యేకంగా తీర్చిదిద్ది, పరిరక్షించే వృక్ష జాతికి మనం ఏం చేస్తున్నాం?

రాతివనాల నిర్మాణాలకై హరిత వనాలను నిర్మూలిస్తున్నాం.
అందుకే మానవ జాతి తరఫున వృక్ష జాతిని తలవంచి క్షమాపణ వేడుతూ.....

మందాకిని .

6 వ్యాఖ్యలు:

  1. మా తెలుగు తల్లికీ మల్లెపూదండ
    ఇదికూడా ఓసారి చూడండి.
    http://kasstuuritilakam.blogspot.com/search/label/%E0%B0%AE%E0%B0%BE%20%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%20%E0%B0%A4%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%20%E0%B0%AE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%86%E0%B0%AA%E0%B1%82%E0%B0%A6%E0%B0%82%E0%B0%A1

    ప్రత్యుత్తరంతొలగించు
  2. చూశానండీ! నేను తెలుగులోనే కదా రాస్తాను!

    ప్రత్యుత్తరంతొలగించు
  3. ధన్యవాదాలు.
    అందమైన ప్రకృతి గురించి సుందర తెలుగులో ఏం వ్రాసినా బాగుంటుంది.
    ఏమంటారు?

    ప్రత్యుత్తరంతొలగించు
  4. క్షమాపణలతో సరిపెట్టలేం ఈ తప్పుని. మనవంతు మొక్కలు నాటుతూ ఉండడమే మనం చేయగలిగనది.

    ప్రత్యుత్తరంతొలగించు
  5. తప్పకుండా! సమాజంలో వచ్చిన అవేర్ నెస్ మంచి ఫలితాలనిస్తుందని ఆశిద్దాం.
    మనందరమూ అందుకై పాటుపడాలి.

    ప్రత్యుత్తరంతొలగించు