తొలి వలపే తీయనిది .....
ఊహల్లో విహారాలే!
గుండెల్లో సరాగాలే!
పూలల్లో విలాసాలే!
వెన్నెల్లో వసంతాలే!
కళ్ళల్లో కోలాటాలే!
శ్వాసల్లో స్వరాలేలే!
చూపుల్లో కయ్యాలేలే!
మాపుల్లో వినోదాలే!
మాటల్లో మోమాటాలే
మౌనాల్లో మర్మాలేలే!
మరులంటే ఆనందాలే!
కురిసేటి మరందాలే!
**************************************************************************************ఊహల్లో విహారాలే!
గుండెల్లో సరాగాలే!
పూలల్లో విలాసాలే!
వెన్నెల్లో వసంతాలే!
కళ్ళల్లో కోలాటాలే!
శ్వాసల్లో స్వరాలేలే!
చూపుల్లో కయ్యాలేలే!
మాపుల్లో వినోదాలే!
మాటల్లో మోమాటాలే
మౌనాల్లో మర్మాలేలే!
మరులంటే ఆనందాలే!
కురిసేటి మరందాలే!
....మదిలో మిగిలిన గాయమిది..
మధురోహలన్నీ మాయమాయే!
మరుగాయెలే సరాగాలే!
పూబాలలే విలపించేనే!
వెన్నెలరేయి వియోగాలే!
కన్నుల ఉబికే కన్నీరేలే!
శ్వాస శ్వాసలో నిట్టూర్పులే!
చూపులన్నీ నీకై వెతికే!
మాపటేల మనోవ్యధలే
మాటలన్నీ మౌనాలాయే
మౌనాలెంచే జ్ఞాపకాలే!
మరుభూమీ జీవితము!
కడవరకూ పెనుభారము!
-లక్ష్మీదేవి.
:)
ప్రత్యుత్తరంతొలగించు??
ప్రత్యుత్తరంతొలగించుబావుంది...
ప్రత్యుత్తరంతొలగించుఎమిటో.... రెండు భాగాల్ని పక్కపక్కన పెట్టాలని ఎంత ప్రయత్నించినా రావట్లేదు.
ప్రత్యుత్తరంతొలగించుధన్యవాదాలు. అవునూ, నాబ్లాగుని చూస్తే మీకు హే......మీ అనిపించలేదాఆ ఆ ఆ(.........
చాలా బాగా రాశారు.
ప్రత్యుత్తరంతొలగించుధన్యవాదాలు.
ప్రత్యుత్తరంతొలగించుఈ పాట కూడా (తొలి వలపే..) బావుంటుందండి.