Loading...

28, మే 2010, శుక్రవారం

చందమామా!

చెట్టుచాటున చందమామా
బెట్టు చాలిక వెలికి రామ్మా!!

పెట్టుకున్న దిష్టిచుక్క
పుట్టుమచ్చగ మిగిలిఉన్నా
ఒట్టు నీకది కొత్త పచ్చ
బొట్టుకన్నా అందగించేనే!!

పిట్టలమ్మల నాగమంటూ
చిట్టి ఊయలలూగమంటూ
గొరువంకల నాడరమ్మని
నెలవంక చందమైనావే!!

రేతిరంతా వెన్నెలెంతో
పంచి పంచి అలసినావో
సందె లోని చీకటంతా
తుంచి తుంచి తరిమినావో!!

-మందాకిని.

9 వ్యాఖ్యలు:

  1. చాలా బాగుందండీ. సింప్లీ సూపర్బ్.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. @ashok,
    ధన్యవాదాలు.
    మందాకిని అనేపేరు చూసీ సర్ అంటారేంటండీ బాబూ!

    ప్రత్యుత్తరంతొలగించు