Loading...

26, మే 2010, బుధవారం

వనిత... లత... కవిత

రచన :వేటూరి
చిత్రం : కాంచన గంగ
గాయకుడు: ఎస్.పి బాలు
*********************పాటను వినడానికి ఇక్కడ నొక్కండి  
ఈ లంకెలో ఉన్న నాలుగు పాటల్లో ఈ పాట ఎంచుకుని "పాడు" నొక్కాలి. (సెలెక్ట్ చేసి ప్లే నొక్కాలి)
వనిత... లత... కవిత
మనలేవు లేక జత!!
వనిత... లత... కవిత
మనలేవు లేక జత!!

ఇవ్వాలి చేయూత...
మనసివ్వడమే మమత..మనసివ్వడమే మమత..!!

వనిత... లత... కవిత
మనలేవు లేక జత!!

పూలు రాలి.. నేలకూలి తీగబాల సాగలేదు..
చెట్టు లేక.. అల్లుకోక.. పువ్వు రాదు.. నవ్వలేదు!
మోడు మోడని తిట్టుకున్నా... తోడు విడిచేనా?
పులకరించే.. కొత్త ఆశ, తొలగిపోయేనా!!
వనిత... లత... కవిత
మనలేవు లేక జత!!

ఆదరించే ప్రభుత లేక.. కావ్య బాలా నిలువలేదు..
కవిత ఐనా.. వనిత ఐనా, ప్రేమ లేకా పెరగలేదు!
చేదు చేదని తిట్టుకున్నా...చెలిమి విడిచేనా?
చేదు మింగి... తీపి నీకై, పంచ మరిచేనా!!
వనిత... లత... కవిత
మనలేవు లేక జత!!

తనది అన్నా..గూడు లేకా కన్నెబాలా బతుకలేదు..
నాది అన్న తోడు లేకా.. నిలువలేదు విలువలేదు!
పీడ పీడని తిట్టుకున్నా... నీడ విడిచేనా!
వెలుగులోన..నీడ లోన, నిన్నుమరిచేనా!!
వనిత... లత... కవిత
మనలేవు లేక జత!!

6 వ్యాఖ్యలు:

  1. మందాకిని గారూ...,

    నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
    ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
    నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
    మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

    తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
    తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
    హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

    మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

    - హారం ప్రచారకులు.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. భలేవారే! మాకు హారం గురించి తెలీకపోవటమేంటండీ!
    మేం హారానికి పాతవాళ్ళమేగా!
    మీకు మా అబినందనలూ, ధన్యవాదాలూను.

    ప్రత్యుత్తరంతొలగించు
  3. మనలేవులే జతలేక -అని ఉండాలి ,మీరొకసారి తిరిగి లిరిక్ ను పరిశీలించ ప్రార్ధన -చల్లా.జయదేవనందశాస్త్రి.చెన్నై .సెల్ -౯౮౮౪౬౭౫౩౨౯ [09884675329]/mail.id-joyd1961@gmail.com

    ప్రత్యుత్తరంతొలగించు
  4. @astrojoyd,
    నమస్తే.
    మీరు కవితగా చూస్తే అదే సరి అయింది.
    కానీ పాటలో "మనలేవు లేక జత" అనే ఉంది. పాటవిందామా అని లింక్ ఇచ్చాను.
    దయచేసి పాట విని చెప్పమని ప్రార్ధన.

    ప్రత్యుత్తరంతొలగించు
  5. నాకెంతో ఇష్టమైన పాటండీ ఇది.

    ప్రత్యుత్తరంతొలగించు