Loading...

13, ఏప్రిల్ 2010, మంగళవారం

పరీక్షల్లో మాథ్స్ గురించి..

ఈ మధ్య పరీక్షలకు ఒకటికన్న ఎక్కువ సెట్స్ ప్రశ్నాపత్రాల్ని తయారుచేస్తున్నారు. బహుశా కాపీ కొట్టకుండానేమో.
ఈ సారి జరిగిన 12th std. cbse మాథ్స్ పరీక్షలో మూడు సెట్స్ of పేపర్స్ ఉన్నాయి. అందులో 1& 3 సెట్ లో ఒక ప్రశ్న తప్పుగా ప్రింట్ అయ్యింది. అంటే function based question కి particular function ఇవ్వలేదు. దాంతో ఆ ప్రశ్న ప్రింట్ అయిన సెట్ రాసే విద్యార్థులకు ఆ ప్రశ్నను వదిలివేసినా, పూర్తి ఆరు మార్కులు వచ్చేలా అనుమతి ఇచ్చారు.
ఇందులో సమస్యేంటంటే.... మా అబ్బాయి రాసిన సెట్ లో ఆ ప్రశ్నా లేదు, ఆ ఉచిత ఆరు మార్కుల స్కీమూ వాడికి వర్తించే అవకాశమూ లేదు. వాడి బాధ అది కాదు. మేము ఇచ్చిన మూడు గంటల కాలంలో అన్ని ప్రశ్నలకూ సమాధానం రాశాము. కానీ ఆ పర్టికులర్ సెట్ రాసినవాళ్ళకి ఆ ప్రశ్నకు ఆరు మార్కులు ఉచితంగా ఇవ్వటమే కాక, ఆ ప్రశ్నకు సంబంధించిన కాలవ్యవధి కూడా ( ఏ అయిదు నిముషాలో) సేవ్ అయ్యాయి. అంటే మూడు గంటల కాలంలో వాళ్ళు 29 ప్రశ్నలకు బదులు 28 మాత్రమే రాశారు.
కాబట్టి వాడనేదేమిటంటే..
ఆరు మార్కులు ఇవ్వటం కాకుండా పేపర్ని వాళ్ళు రాసిన 28 ప్రశ్నలకు గాను, 94 మార్కులకే correction చేయాలి అంటాడు. అవసరమైతే వచ్చిన మార్కులని 100 మార్కులకు convert చేయాలి అంటాడు.
నాకేం చెప్పాలో తెలీట్లేదు. మాకైతే అందరికీ ఒకే సెట్ ఉండేది కాబట్టి ఈసమస్య వచ్చే అవకాశమే లేదప్పట్లో..

వాడు చెప్పినట్లు చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందనిపించినా ఎందుకో పూర్తిగా సమర్థించలేకపోతున్నా.
ఈ విషయం గురించి పూర్తి అవగాహన ఉన్న మిత్రులెవరైనా నా సందేహం తీర్చగలరా?
మన చేతుల్లో ఏమీ లేదనుకోండి. అయినా మనసుకి ఏదో ఒక సమాధానం కావాలి కదా!

2 వ్యాఖ్యలు:

 1. మీ అబ్బాయి చెప్పింది ఎందుకు కరెక్ట్ కాదు అంటే.. ఆ 6 మార్కుల ప్రశ్నకి వారిలొ కొందరికి పూర్తి సమాదానం తెలిసి వుండొచ్చు.. 94 కి వచ్చిన మార్కులు 100 కి కన్వర్ట్ చెస్తే ఆ మార్కులు నస్టం కదా.. తనకి అర్ధం అయ్యేలా చెప్పాలంటే ; తను రాసిన పేపర్ లొ ఈజీ గా ఆరుకు ఆరు వచ్చే ప్రశ్న మినహాయించి మిగతా మార్కులు (94 కి వచ్చిన మార్కులు) వందకి కన్వర్ట్ చెస్తే ఒకేనా అని అడగండి..ఒప్పుకోడు.. ఎందుకంటే.. ఎక్కువ రన్స్ వచ్చే ఓవర్ వదిలేసి మిగతా ఓవర్స్ కి రన్ రేట్ చూసినట్టు..
  అలాగే ఫ్రీ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు.. అది మీ అబ్బాయి వాదించేది కరెక్టె.. ఆ సెట్ వచ్చిన వాళ్ళు నస్టపొకూడదు..

  నా ఉద్దేస్యం లొ చెయ్యాల్సింది..

  పూర్తి పేపర్ రాసిన వాళ్ళలొ (మీ అబ్బయి సెట్ లొ) , 6 మార్కుల ప్రశ్నల్లొ తక్కువ మార్కులు వచ్చిన ప్రశ్నకి 6 మార్క్స్ వెయ్యాలి.. పేపెర్ లొ ఆ ప్రశ్న లెనివారికి 6 మార్క్స్ ఇచ్చినట్టు.. ఉదాహరణకి మీ అబ్బాయికి .. అన్ని 6 మార్కుల ప్రశ్నల్లొ ఎదయితే తక్కువ వచ్చిందొ (సున్నా వచ్చినా సరే) దానికి 6 వెయ్యాలి..
  ఇంకోలా చెప్పలంటే.. సెట్ 1 & 3 వచ్చిన వారికి 94 కి కరెక్ట్ చేసి.. సెట్ 2 వచ్చిన వారికి కూడా 94 కే చెయ్యాలి.. ఏ ప్రశ్న తీసెయ్యలి అంటే.. ఏ ప్రశ్నకయితే అయితే తక్కువ మార్క్స్ వస్తాయొ ఆ ప్రశ్న తీసెయ్యాలి..

  Hope you understand my point..:-))

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మంచు పల్లకీ,
  కృతఙ్ఞతలు. మీరు చెప్పింది సబబుగా అనిపిస్తుంది.

  ప్రత్యుత్తరంతొలగించు