Loading...

15, మార్చి 2010, సోమవారం

ఏవేవో వింత ఊహలు....

మహార్ణవం.......
మహా సాగరం.......ఎంత పెద్దదో! సాగరమెంత మురిపిస్తుందో నన్ను.
సాగర తీరాన నుంచుని చూస్తూంటే ఏవేవో వింత ఊహలు....
ఎగసి పడుతూ వచ్చి కాళ్ళను తాకుతున్న అలలు ఇంటికి వెళ్ళగానే, అక్కయ్యా అంటూనో అత్తయ్యా అనో పరిగెత్తుకు వచ్చి కాళ్ళకు చుట్టుకు పోయే చిన్నపిల్లల్లా..
సరిగ్గా వాటికి వెనక చిన్నచిన్నగా కదులుతున్న అలలు వసారాలో కూర్చుని పూలు కడుతూ గుమ్మంలో బండి దిగిన కూతుర్ని చూసి చిరునవ్వుతో చేతులు చాపి పిలుస్తున్నట్టు..
అంతకన్నా వెనక వాలుకుర్చీలో కూర్చుని దినపత్రికలోంచి తల తిప్పి చూసి చిరుమందహాసంతో స్వాగతం చెప్పిన నాన్నగారిలా నడిసంద్రపు గాంభీర్యం...
సూర్యాస్తమయ సమయంలో రంగురంగుల ఆకాశం..కొత్తగా రంగులేసిన మా ఇంటి పై కప్పులా..
గాల్లో ఎగురుతున్న రంగుల గాలిపటాలు వాకిలికి తోరణాలల్లే..
దూరంగా అస్తమిస్తూ కాస్త చెదరినట్టు కనిపిస్తున్న సూర్యుడు ఐదు గంటలకే వెలిగీ..వెలగనట్టున్న వీధి దీపంలా..
మా ఇంటి సంబరాల్ని చూడ్డానికొచ్చిన ఇరుగు పొరుగుల్లా ..... అక్కడంతా జనం.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి