Loading...

8, మార్చి 2010, సోమవారం

మరో జన్మ ఉంటే..

మరో జన్మ ఉంటే.. అనే శీర్షిక తో మావాళ్ళందరూ టపాలు వ్రాస్తుంటే, మా ప్రత్యేకమైన రోజైనా నేను వెనక బడకుండా నేనూ పాలు పంచుకోవాలని.... ఈ టపా.
చిన్నప్పుడు నేనూ మరో జన్మ ఉంటే ఇలాగే అమ్మాయినై పుట్టాలని అనుకునే దాన్ని. నేనెప్పుడూ అమ్మాయినైనందుకు (చిన్నప్పుడే కాదు, ఇపుడు కూడా) బాధ పడలేదు. బాధలు పడలేదు. అంటే నాకే సమస్యలూ రాలేదని కాదు. సమస్యలు, బాధలూ ఏవైనా అమ్మాయి అయినందుకే, మిగతా ప్రపంచపు అణచివేత వల్లే వచ్చాయని ఆలోచించే పంథా నాకు నచ్చదు.
మాథ్స్ అంటే ప్రాణమైనా, క్లాసులో ఒక్కత్తివే కాబట్టి వద్దన్నా ఆ సమస్యని నేను పరిష్కరించుకోగలిగిందే. చదివి ఏదో సాధించాలన్న స్ఫూర్తి లేకపోవడం నన్ను రాజీ పడనిచ్చింది. ఇది కొంతమంది అబ్బాయిలకు కూడా ఉంటుంది కదూ!
కాకపోతే నది తన ప్ర్రయాణంలో ఎత్తు పల్లాలు చూసినట్టుగా, నా జీవితంలోనూ, చుట్టు ఉండే వాళ్ళ జీవితాల్లోనూ కష్టసుఖాలు చూశాక...
మరుజన్మ కావాలని కోరిక లేదు. ఇష్టము, అయిష్టము, ఆశ, నిరాశ ఇవి నన్ను పెద్దగా బాధించడం మానివేశాయి.
మరెందుకు ఈ టపా అంటారా, పైన చెప్పానుగా....................!

17 వ్యాఖ్యలు:

 1. ఆత్మ స్ధైర్యం వున్నవారికి ఆటంకాలు గడ్డిపోచలేకదా.
  psmlakshmi

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఈ జన్మ లో ఏం సాధించారో చెప్పండి , మరో జన్మ ఇవాలా వద్దా అనేది నే డిసైడ్ చేస్తా.

  - విధాత :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ప్చ్ ...పోన్లెండి ...మహిళా దినోత్సవ శుభాకాంక్షలు !

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మీ కొటేషన్ బావుంది లక్ష్మి గారూ!
  @అఙ్ఞాత
  విధాత గారూ! బోల్డు థాంకులండీ! మీరే దిగివచ్చేస్తారనుకోలేదు సుమండీ!
  నేనేం సాధించానో తమరికి తెలీకపోవడమేంటండీ విచిత్రం?????

  ప్రత్యుత్తరంతొలగించు
 5. @మాలా కుమార్ , సంతోషమండీ!
  పరిమళ గారూ! మీకూ నా శుభ ఆకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. ఆశ, నిరాశల పోరటమే కదండి జీవితం. అదేనండి సుఖదు:ఖాలన్నమాట. ఇన్ని భవసాగరాలు ఈదాలి కదండి. మోక్షం చిట్టచివరిది కదా మరి. I wish you all the best.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఈ మధ్య కొంచెం ఆధ్యాత్మికత వేపు దృష్టి మళ్ళింది లెండి. జయగారూ!మీకూ శుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. అంతేనండీ.. మనకి ఇష్టం వున్నా లేకపోయినా నలుగురూ నడిచే దారిలో నడవడానికి అలవాటు పడిపోయాం. మీకు ఇది అంత ఆసక్తిగా లేదు కనుక కొత్తదారి ఏదైనా వుంటే చెప్పండి. ముందు నడిచే మీలాంటివారికి కష్టమైనా తరవాతి వారికి మార్గ దర్శకులవుతారు. ప్రయత్నించండి. మహిళాదినోత్సవ శుభ సమయంలో కొత్తదనానికి మొదటి అడుగు వేయండి. మేమూ వెన్నంటే వుంటాం..

  ప్రత్యుత్తరంతొలగించు
 9. మందాకిని గారూ !
  మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

  ప్రత్యుత్తరంతొలగించు
 10. శ్రీ లలితగారూ! కొత్త దారి ఏముందండీ, ఇవాళ ఉన్న ఇంతే అందమైన జీవితం ఉంటుందన్న హామీ ఎవ్వరూ ఇవ్వలేరు కాబట్టి అందమైన సీతాకోక చిలుక గానో, అసహ్యించుకోబడే బొద్దింక గానో ఎలా ఉంటుందో మరుజన్మ తెలీదు కాబట్టి ఎందుకు రిస్క్, ఆశా వద్దు, నిరాశా వద్దని అలా ఫిక్స్ అయ్యానన్న మాట. అదీ అసలు విషయం. అలా అని నేను బోల్డు కష్టాలు పడ్డానని అందుకే ఈ మెట్టవేదాంతం అనుకోకండేం.... సాధారణంగా అందరికీ ఉండేవే కదా! కానీ అందులోంచే నేను
  ఈ ప్రపంచంలో కనిపించేది అంతా మాయ, ఏదీ శాశ్వతం కాదు అనే విషయం అర్థం చేసుకున్నానన్నమాట.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. రావ్ గారూ! ధన్యవాదాలు.
  కొత్త పాళీ గారూ! yah! thanq for concern.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. మొత్తానికి వేదాంతంలో పడ్డారన్న మాట! ;-)

  ప్రత్యుత్తరంతొలగించు
 13. ఔనండీ మధురవాణి గారూ!
  ఈ విషయానికి మీరు రాసిన టపా చాలా...చాలా బావుంది.
  నాకు భలే నచ్చేసింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. నా బ్లాగులో మీ వ్యాఖ్యకి సమాధానమిస్తూ ...మీరు నాకు మందాకినీ మాత లా కనిపిస్తున్నారు అన్నాను.
  మీ టపాతో అది నిజం చేశేసారు. అబ్బె..బ్బే...... ఏవిటండీ ఈ వైరాగ్యం ఏం తొందర! కలలకి, ఊహలకి సాధ్యా అసాధ్యాలు ఆలోచించకూడదండీ. జీవితంలో(వుందోలేదో తెలీని వచ్చేజన్మకి కూడా . పోయిందేవుందీ కొనాలా పెట్టాలా !) ఆశావాదం పెంచుకోండి. ఏదీ కాస్త నవ్వండి. అదీ....అలా నవ్వుతూనే వుండండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. హ..హ...హ.. నవ్వించేశారండీ! చిన్ననాటి స్నేహితురాలిలా పలకరించిన మీ అభిమానానికి ధన్యురాలిని. నిజంగానే నేను ఆశావాదినే. మరో జన్మ వద్దనటం నా ఛాయిస్. అంతే. మన దేశంలో టెర్రరిస్ట్ భయం లేకుండా మనందరం కాశ్మీర్ ఒకరోజు వెళ్ళి రాగలమని కూడా నానమ్మకం. నమ్మండి.

  ప్రత్యుత్తరంతొలగించు