Loading...

14, ఫిబ్రవరి 2010, ఆదివారం

ఏకాంతమేదీ.....?

ఎవ్వరు లేని ఏకాంతాన...
దూరాలకేగిన వలరాజుని
కలనైనా గెలుపొందాలని
నేనొస్తే.....
అక్కల్లా చుక్కలు చక్కిలిగింతలు పెడుతూ...
చెల్లెల్లా వెన్నెల దోబూచులాడుతూ......
అనుంగు చెలులతో సరిగంగ స్నానాలను మదినెన్నంగా
నింగిలో విహంగాలు మురిపిస్తూ.....
తొలి బిడియాలను తొలగించే
తన కడగంటి చూపుల్లా
చిరు చీకట్లను తొలగించే
అందరాని ఆ మామ తూపులు ప్రసరిస్తూ....
నే కోరిన ఏకాంతమేదీ.....?
ఈ సందట్లో......?

మందాకిని.

2 వ్యాఖ్యలు: