Loading...

7, డిసెంబర్ 2009, సోమవారం

చదువుకున్న వాళ్ళు...

చదువుకున్న వాళ్ళు...

మన తెలుగులో కన్నా తమిళ్ సినిమాల్లో కానీ, సీరియల్స్ లో కానీ, బయటిప్రపంచంలో కానీ "పడిచ్చవర్" అని ప్రత్యేకంగా చెప్తుంటారు చదువుకున్న వాళ్ళని. అది ఎంత మూర్ఖంగా ఉంటుందంటే కుటుంబ సభ్యుల్లో కూడా చదువుకున్న వాళ్ళు చెప్పింది సబబా కాదా అని అలోచించకుండా సమర్థిస్తుంటారు!

అదేమిటి, చదువుకున్నంత మాత్రాన వివేకం, విచక్షణా జ్ఞానం వచ్చేస్తాయా ఏంటి? చదువుకోనంత మాత్రాన అనుభవంతో, లోకజ్ఞానంతో అవి రావా ఏంటి?

మంచి, చెడు తెలీడానికి మనం చదువుకునే ఇంగ్లీషులు, ఫిజిక్స్ లూ ఎలా పనికొస్తాయి. అవి పనికిరాని చదువులు అని నా ఉద్దేశ్యం కాదు. వాటితో మనం ఎన్నో సాధించవచ్చు. కానీ

* సాధారణ జీవితానికీ,
* సమాజంలో మనం ఒకరికి ఒకరు తోడ్పాటు అందించుకోడానికీ,
* ఇంటినీ, కుటుంబాన్నీ చక్కదిద్దుకోవటానికీ,
* పిల్లలను పెంచి పెద్ద చేయడానికీ (సక్రమంగా),
* భవిష్యత్తును రూపొందించుకోవటానికీ
* బాధ్యతగా నడచుకోవడం తెలియడానికీ
* అన్నింటికన్న ముఖ్యంగా ప్రేమానురాగాలు పంచటానికీ

ఈ విషయాలు తెలియాలంటే మనం లండన్ బ్రిడ్జ్ పడిపోయిన విషయాన్నో, బల్బ్ ఎలా తయారు చేశారన్న విషయాన్నో, రష్యా రాజ్యాంగాన్నో, జావా ప్రోగ్రామింగ్ నో తెలుసుకుంటే చాలదు. ఇవన్నీ మనం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికీ, మనకూ నాలుగు విషయాలు తెలుసన్న ఈగోని పెంచుకోవడానికీ పనికొస్తాయి.

కానీ జీవితంలొ ప్రతి ఒక్కరికీ ఏదొ ఒక దశలో జీవితంటే డబ్బునీ, ఈగోనీ సంపాదించడం మాత్రమే కాదని
పదిమంది మనసులో తన పట్ల నిజమైన గౌరవం సంపాదించడం అనీ తెలుస్తుంది. కానీ అప్పటికప్పుడు మారడం సాధ్యం కాదు. అందుకని మారినట్టు నటించడం ప్రారంభిస్తారు.

నిజానికి చదువుకున్న వాళ్ళని గౌరవించడం పూర్వకాలం నించీ ఉంది. అయితే అప్పటి చదువులో నిజంగానే మంచీ, చెడూ తెలుసుకునే అవకాశం ఉండేది. ఇది ఎవరూ కాదనలేని సత్యం.

* మనలో ఉన్న ఆత్మ అందరిలోనూ ఉంది అని చెప్పటం ద్వారా ఎవరినీ ఎక్కువ తక్కువ చేసి చూడకూడదని చెప్పారు.
* సర్వే జనా: సుఖినో భవంతు అని జాతి మత లింగ భేదం లేకుండా అందరి క్షేమాన్ని కాంక్షించడం ద్వారా ఎవరినీ ద్వేషించకూడదని నేర్పారు.
* ఆబ్రహ్మ కీట జననీ అని శక్తి స్వరూపిణిని కీర్తించడం ద్వారా అందరూ సోదర సమానులే అని నొక్కి చెప్పారు.

అంతేకాక తప్పులు చేయడం, సరిగా ప్రవర్తించడం వలన కలిగే ఫలితాలేంటో సోదాహరణంగా ఇతిహాస పురాణాల ద్వారా చదువుకున్నప్పుడు మంచీ చెడు విచక్షణ దానంతటదే కలుగుతుంది.

కొన్ని కాలానుగుణంగా మారవచ్చు. కొన్ని కాలాతీత విషయాలుంటాయి. అవి మనకెప్పుడూ పనికొస్తాయి.
తప్పొప్పుల గురించీ, ఫలితాల గురించీ అనుభవాల పాఠాల ద్వారా తెలుసుకోవడం జరిగేది కనుక పూర్వం చదువుకున్న వాళ్ళకూ, చదువులేని వాళ్ళకూ తేడా ఉండేదేమో జీవిత నౌకాయానంలో.

కానీ ఇప్పటి చదువుల్లో విజ్ఞానం పెరుగుతుందేమో కానీ, లోకజ్ఞానం పెరగదు.
ఈ విషయాలు తెలీక నేనూ ఒకప్పుడు ఒకటీ, రెండూ విషయాల్లో నా మిడిమిడి జ్ఞానంతో అనుభవజ్ఞుల్ని మా నాన్నమ్మని వ్యతిరేకించాను. ఇప్పుడు చింతిస్తున్నాను.

8 వ్యాఖ్యలు:

  1. >> "కానీ ఇప్పటి చదువుల్లో విజ్ఞానం పెరుగుతుందేమో కానీ, లోకజ్ఞానం పెరగదు"

    Oops .. అనేక సందర్భాల్లో విజ్ఞానమూ పెరగదు. అంతకు మించి, ఇంగిత జ్ఞానమూ పెరగదు - కార్ఖానాలుగా మారిపోయిన కళాశాలల వల్ల.

    ఉదాహరణలు ప్రస్తుతం కళ్లెదురుగానే ఉన్నవి - హైదరాబాదులో 'విద్యార్ధి శక్తి'కి అగ్గి పాలిటబడి బుగ్గవుతున్న ఆర్టీసీ బశ్శకటాల రూపంలో.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. నిజమైన చదువు ఏమిటో తెలిచేసే ప్రయత్నం బాగుంది. ఎంత నేర్చినా నిరంతరం నేర్చుకోలసింది, తెలుసుకోవలసిందీ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అది స్ఫురణలో ఉంచుకుని వినయంగా, మనకెదురయ్యె ప్రతి సంఘటననుండీ ఎన్నో విషయాలు నేర్చుకోవాలి మనం. అదే ఙ్ఞానానికి దారి చూపిస్తుంది. :)

    ప్రత్యుత్తరంతొలగించు
  3. @ విశ్వ ప్రేమికుడు అయ్యో నా సమస్యలకు అంతే లేనట్టుంది. ఇప్పుడు 4 వ్యాఖ్యలు ఒకేసారి ప్రచురించమని క్లిక్ చేసినా మీ వ్యాఖ్య మాత్రం ప్రచురించబడలేదు. మళ్ళీ ప్రత్యేకంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
    ఇక నేను టపాలు బరహాలో, వ్యాఖ్యలు లేఖిని లో రాస్తున్నాను. నేరుగా వ్యాఖ్యల పెట్టెలో తెలుగు ఎలాగు? చెప్పండి
    ur comment is still visible at my box. how to print it?

    ప్రత్యుత్తరంతొలగించు
  4. బాధపకండి నావ్యాఖ్య ప్రచురించబడింది. నేను వ్యాఖ్య రాసింది ఈ టపాకి కాదు. కోయిలా అనే టపాకి. కాబట్టి అక్కడ ప్రచురించ బడింది. :)

    ఇక మీరు ఎక్కడపడితే అక్కడ తెలుగు టైపు చేసుకోవడానికి Barha IME 1.0 ని గూగులమ్మలో వెతికి డౌన్ లోడ్ చేసుకోండి. దాన్ని ఇనిస్టాల్ చేసుకున్న తరువాత డెస్క్ టాప్ మీద వచ్చే ఐకాన్ న్ని ఓ నొక్కు నొక్కండి. తరువాత కింద టాస్క్ బార్ లో వచ్చిన EN అనే దానిని రైట్ క్లిక్ చేసి తెలుగు లిపికి సెట్ చేసుకోండి.

    అంతే ఇక మీరు ఎక్కడ బడితే అక్కడ తెలుగును టైప్ చెయ్యవచ్చు. english కావాలన్నప్పుడు F11 ను నొక్కండి. మళ్లీ తెలుగు కావాలన్నా అదే నొక్కండి. చాలా బాగుంది కదూ.... మీ టైపాటులు తీరితే ఈ సోదరుడికి ఓ లడ్డూ తినిపించాలి మీరు. :)

    ప్రత్యుత్తరంతొలగించు
  5. http://www.baraha.com/download.htm

    ఇక్కడ Baraha IME 2.0 Downlode link ఉంది చూడండి.

    ప్రత్యుత్తరంతొలగించు
  6. @అజ్ఞాత
    @అబ్రకదబ్ర
    @విజయ్
    మీ అభిప్రాయాల్ని నాతో పంచుకున్నందుకు చాలా సంతోషం.

    ప్రత్యుత్తరంతొలగించు
  7. @విశ్వ ప్రేమికుడు
    నిజమేనండోయ్ ఖంగారులో నేను గమనించనే లేదు.
    నేను బరహా ఇన్ స్టాల్ చేసుకుని టపాలన్నిటికీ ఉపయోగిస్తున్నాను.
    కాకపోతే నా సిస్టంలో నెట్ లేదు. బయట బ్రౌజ్ చేసినప్పుడు లేఖినిలో వ్యాఖ్యలు రాస్తాను.
    కాబట్టి నా పాట్లూ తీరవు. సోదరుడికి నా చేతి లడ్డూ ప్రాప్తంలేదు. ప్చ్....

    ప్రత్యుత్తరంతొలగించు