కోయిలా...
కోయిలా కూయవే
తీయగా హాయిగా...
రతిరాయని చెలుని చేత
ప్రియమార సింగారమైన
మాయని సోయగాల వనాల
మలయ మారుతాల
ఊయలలూగి......
ఆమని లేదని
నా పని కాదని
హేమంతాన్ని చిన్నబుచ్చకేఁ....
మరునికీ, మనసుకీ
వలపు తలపులలో
మునిగితేలే
కవుల భావనాలోకానికీ
లేని నియమం
నీకెందుకే......
- మందాకిని.

వసంతం రాకుండానే ....తొందరపడి ఒక కోయిలా ..ముందే కూసిందీ ....విందులు చేసిందీ ...:)
ప్రత్యుత్తరంతొలగించుహేమంతమైనా సరే వచ్చి వీనులవిందు చేయమని నేనడిగితే.. మీదగ్గరకు వచ్చి వినిపించిందా!
ప్రత్యుత్తరంతొలగించుjust kidding!
మీ కవితలు నాకెంత నచ్చుతాయో చెప్పలేను. ఎందుకంటే మీ బ్లాగులో అదేమిటో.. {నాకు మాత్రమే కట్ అండ్ పేస్ట్ పనిచేయదు.బోల్డన్ని వ్యాఖ్యలు వచ్చాయి కదా మరి}
నేను చెప్పాలనుకున్నదేమిటంటే మీ కవితలకు నా స్పందన లేఖిని లో రాసి కట్ అండ్ పేస్ట్ చేద్దామంటే కుదర్లేదు. పేస్ట్ కాలేదు. ఇంగ్లీష్లో రాయలంటే ఇష్టముండదు.
ప్రత్యుత్తరంతొలగించుచాలా చాలా బాగా రాశారు. మీరు తెలుగు టైప్ చెయ్యడానికి ఇంకా లేఖిని లోనే ఉన్నట్లున్నారు. ఇప్పుడు Barha IME 1.0 లేకపోతే Barha 8.0 లతో నేరుగా వ్యాఖ్యల పెట్టెలోనే తెలుగు టైపు చేయవచ్చు. అంతే కాదు మీరు మీ కంప్యూటరులో ఎక్కడంటే అక్కడ తెలుగులో రాయవచ్చు. కట్ , కాపీ ల కష్టం ఉండదు.
ప్రత్యుత్తరంతొలగించు