చెలీ! ఓ చెలీ!
ఓ చెలీ!
నా మనసులోపూచిన వలపుమందారానివో
మకరందాలు నింపిన మధుబాలవో
ఓ చెలీ!
వీణానాదామృత భరితమైన నీ
మధుర స్వరంలో తీగనవనీవో
ఓ చెలీ!
సవ్వడితో నా కలల సందిట -సందడి చేసే
నీ అందాల పాదాల అందెల మువ్వనవనీవో!
ఓ చెలీ!
నీ చెక్కిట చిరు జాబిలినవనీవో
నీ కౌగిట నా జీవనం ఆగిపోనీవో
ఓ చెలీ!
నీ నీలి సంద్రపు అలల వంటి
కురులలో మరుమల్లికనవనీవో!
ఓ చెలీ!
మదనుని పిలుపుల వంటి నీ గాజుల
గలగలలో చిరు కదలికనవనీవో!
ఓ చెలీ!
జిలుగు వెలుగుల నీ నయనమ్ముల
మెరిసే ఆనంద రేఖనవనీవో!
కాటుక రేఖనై నీ కనుసన్నల
మెలిగే వరం ప్రసాదింపవో!
ఎప్పుడో చదువుకునే రోజుల్లో వ్రాసుకున్న కవిత. పుస్తకాల మధ్యలో దొరికింది. కాగితం అయితే చినిగిపోతుంది, అని నా బ్లాగులో పదిలంగా దాచుకోవాలని....
- మందాకిని.
మీరు రాసుకున్నదా ? లేక మీకెవరైనా రాసినదా ?
ప్రత్యుత్తరంతొలగించుjust kidding :) :)
చాలా బాగుంది కవిత.
ప్రత్యుత్తరంతొలగించురేఖనవనీవో! , కదలికనవనీవో! వంటివి ప్రయోగించారు.
అంటే రేఖనవు నీవో అని అర్థమా? ఇలాంటివి నేనూ ఇదివరకూ చదివినట్లు గుర్తు.
ఇక్కడ ఈ కవితలో మీరు ఉపయోగించిన ఆ పద ప్రయోగాలన్నీ సరి అయినవేనా? నాకెందుకోసరి కాదేమో అనిపిస్తోంది. వీటికేమైనా వ్యాకరణ నియమాలు ఉన్నాయా? అన్యధా భావించక కొద్దిగా తెలియజేయగలరు.
పరిమళ గారూ! నేనే రాసుకున్నానండీ!
ప్రత్యుత్తరంతొలగించురాయాలని అనిపిస్తున్నప్పుడు, మనసులో కొత్త ఊహలు చిగురిస్తున్నప్పుడు, రాసేవారికి అలాంటి భేదాలేం ఉండవండీ. ఏదైమైనా నేను ఇలాంటి భావుకతతో నిండిన లేఖలేవీ అందుకోలేదంటి నమ్మండి.
విశ్వ ప్రేమికుడు గారూ!
ప్రత్యుత్తరంతొలగించుధన్యవాదాలు.
రేఖను అవనీవో అని అర్థం. అవటానికి అనుమతి ఇవ్వవా అని. అన్నీ అంతే.
వ్యాకరణ నియమాలేం లేవండీ. నాకవన్నీ తెలీదు. ఏదో తోచింది అలా రాశానంతే.