Loading...

16, సెప్టెంబర్ 2009, బుధవారం

సినీ నాయికలు -విషాద గీతాలు

సినీ నాయికలు -విషాద గీతాలు

విషాద గీతాల్లో మన దేశానికి సంబంధించినంత వరకు దేవదాసు పాటలు మాత్రమే ప్రస్తావనకు వస్తుంటాయి.
కానీ సినీ నాయికలు పాడే విషాద గీతాలు కూడా ఎంతో బాగుంటాయి. బాగా ప్రాచుర్యాన్ని పొందినవి ఇవాళ ఎందుకో అలా గుర్తుకు వస్తున్నాయి.

అంతా భ్రాంతియేనా..
జీవితాన వెలుగింతేనా
ఆశా నిరాశేనా.. మిగిలేది చింతేనా
ఈ పదాలు ఎవరు ఎలా నిరాశకు గురి అయినా మనసులో అనిపించే భావాలకు అద్దం పడుతున్నాయి.

నీ చెలిమి నేడే కోరితిని
ఈ క్షణమే ఆశ వీడితిని.... నీ చెలిమి....
ఈ పాట మొత్తం నాయకుడిని చేరలేక పోయిన నాయిక వ్యథను చక్కగా ప్రతిఫలించే పదాల్లో మనసులు భారం చేసే శక్తి ఉంది.

సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే..
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలౌతుంటే...
ఈ పాటలో సముద్రమంత కన్నీరు, ఎడారి సెగలను పోలిన గుండెమంటలను, నాయిక నిస్సహాయతను ఫీల్ అయితే కన్నీళ్ళు ఆగవు.

ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెపుతున్నా
బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా
ఈ పాటలో
స్నేహం నాదే ప్రేమా నాదే ఆ పైన ద్రోహం నాదే
తప్పంతా నాదే శిక్షంతా నాకే తప్పించుకోలేనే
అనే పదాల్లో పొరబాటో లేక గ్రహపాటో, నాయకుడిని దూరం చేసుకున్న నాయిక ఆవేదన మనసుని కదిలించేస్తుంది.

ఈ పాటల లింక్ ఇవ్వాలనుకున్నా గానీ కుదర్లేదు.
సినిమా పేరు, నాయిక పేరు అనవసరం. పాటలు రాసిన వారు ఎంత అందమైన పదాలు కూర్చి తెలిసిన భావాల్ని ఎంత కొత్తగా, హృద్యంగా రాస్తున్నారు!
వాళ్ళకి నా జోహార్లు.

2 వ్యాఖ్యలు: