Loading...

25, జులై 2009, శనివారం

నీ చెలిమి...

చెలుడులేడు చెలిమి లేదు
కంటిలో చెలమ తప్ప

కలలు లేవు మరులు లేవు
శిలగ మారిన మనసు తప్ప

కనులకాంతి లేదు మనశ్శాంతి లేదు
మాసిపోని చింత తప్ప

కొత్త కొత్త కథలు లేవు
గుండెలోని వెతలు తప్ప

భావితలిచి ఎదురుచూపు లేదు
మదినాటుకున్న
ఆశాభంగపు తూపు తప్ప

జీవితంపై మోజు లేదు
చావు తెచ్చే రోజు రాదు!!

- మందాకిని.

7 వ్యాఖ్యలు:

 1. ఎందుకో అంతా ఈ నిర్వేదాలు వెలికితెస్తున్నాము. ఇదేమి కాలవైపరీత్యమో కదా!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఊహలు అన్నివైపులా ప్రయాణం చేయగల అందమైన పక్షుల్లాంటివి కదా!
  ఓ సమయం నిరాశ, ఓ సమయం నవోల్లాసం వాటి దారుల్ని నిర్దేశిస్తాయేమో!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. కవిత చాలా బాగుందండీ. మీ భాషా ప్రయోగం, పదాల కూర్పు చక్కగా ఉన్నాయి. :)

  ప్రత్యుత్తరంతొలగించు