పెదవి గుమ్మం దాటలేని మూగబాసలు
చిరునవ్వుల తోరణాలై కనువిందు చేస్తున్నాయి!
కదలివచ్చిన చూపులకిరణాలు
నునుమేని తాకిడికి పరావర్తనం చెందుతున్నాయి!
మౌనాల వెనక దాగిన పలుకులు
మనోకుసుమాన్ని వికసింప చేస్తున్నాయి!
కలల కదిలే స్వర్ణ భవితకు
కాంతులీనే శొభవై అగుపిస్తున్నావు!
వర్ణమయమై
విరులవనమై
మన బతుకు బాట సాగిపోనీ!!
-మందాకిని.
nice chala baga rasaru, పెదవి గుమ్మం దాటలేని మూగబాసలు
ప్రత్యుత్తరంతొలగించుచిరునవ్వుల తోరణాలై కనువిందు చేస్తున్నాయి! ee lines chala bagunnayi.
ధన్యవాదాలు మాష్టారూ!
ప్రత్యుత్తరంతొలగించుపరావర్తనం అని ఎందుకు రాశానంటే నేను తిరిగి నిన్ను చూస్తున్నాను అని.
ప్రత్యుత్తరంతొలగించు