Loading...

11, ఏప్రిల్ 2009, శనివారం

రాగాల పల్లకి

ఈ పాట వినడానికి ఇక్కడ నొక్కండి.

ముందు తెలిసెనా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసెనా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసెనా ప్రభూ!

అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
సుందర మందారకుంద సుమ దళములు పరువనా
సుందర మందారకుంద సుమ దళములు పరువనా
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును

ముందు తెలిసెనా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసెనా ప్రభూ!

బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానేరావు
బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానేరావు
ఎదురగయని వేళవచ్చి ఇట్టే మాయమవుతావు
ఎదురగయని వేళవచ్చి ఇట్టే మాయమవుతావు
కదలనీక నిముసము నను వదలిపోక నిలుపగ
నీ పదముల బంధింపలేను హృదయము సంకెల జేసి

ముందు తెలిసెనా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసెనా ప్రభూ!

***

6 వ్యాఖ్యలు:

 1. ఇది నాకు చాలా చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి.. ముఖ్యంగా 'బ్రతుకంతా ..' చరణం..

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఎదురు చూచే మనసు ఉండే వారికి ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా!
  ధన్యవాదాలు మురళి గారూ!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. పాటల సందడి ముగిసిందనుకుంటే రాగాల పల్లకి ఎక్కించారే!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. పరిమళగారూ!

  బోయీలతో పని లేని రాగాల పల్లకి! ఎవరైనా ఎక్కేయొచ్చు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. నాకెంతో ఇష్టమైన పాట ఇది. చాలా సంతోషం మీరిలా పంచినందుకు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఉష గారూ!ప్రేమిక హృదయ స్పందన మరి. అద్భుతంగా ఉందనిపిస్తుంది విన్న ప్రతిసారీ!

  ప్రత్యుత్తరంతొలగించు