ఎన్నెన్నో అందాలు చందమామకి
కన్నేసి చెంతచేరె తారభామిని
కన్నులతో రాసుకున్న ప్రేమలేఖలే
మిన్నంతా సాగెనెమో మేఘమాలలై
జాజిపూల గంధమై జావళీల చందమై
జాబిల్లి డెందమే అలరారగా
వెల్లువయే కోరికే వెన్నెల్లో వేడుకై
మెల్ల మెల్ల తారకే తళుకులీనగా
దశమి నాటి రేతిరేళ చలచల్లగా
దిశలన్ని వెన్నెల్ల వెలిగిపోయెగా
చక్కనైన చుక్క బొమ్మ పక్కనుండగా
చిక్కనైన చీకటెకడో దాగిపొయెగా
-మందాకిని
కన్నులతో రాసుకున్న ప్రేమలేఖలే
ప్రత్యుత్తరంతొలగించుమిన్నంతా సాగెనెమో మేఘమాలలై
చాలా బాగుందండీ కవిత :)
ధన్యవాదాలు విజయ్ గారూ!
ప్రత్యుత్తరంతొలగించుఒక రోజు డాబా మీద కెళ్ళగానే పెయింటింగ్స్ లో చూసినట్టు నిండు చందమామ, దోబూచులాడే మబ్బులు, తళుక్కున మెరిసే తారలు చూడగానే ప్రేరణ పొంది రాసిన భావన అది .
మందాకిని గారికి నమస్కారం.
ప్రత్యుత్తరంతొలగించుమీరు నా బ్లాగుకి వచ్చి అభిప్రాయాన్ని పంచుకున్నందుకు సంతోషం.
అప్పుడప్పుడు ఇలాగే నా బ్లాగుకి విచ్చేసి మీ సలహాలు సూచనలు అందిస్తే, అంతర్వాహిని.. జీవనదిగా మారుతుందని ఆశిస్తున్నాను.
శలవు.
- నరేష్ నందం.
చీకటి దాక్కు౦దన్న మీ ప్రయోగ౦ భలే ఉ౦ద౦డీ మ౦దాకిని గారూ. మొదటిసారి వచ్చాను. మొదటి టపాలోనే పరవశి౦చాను. నాకు చ౦దమామ కలువభామల జ౦ట అ౦టే ప్రత్యేకమైన ముచ్చట. నా కవనయత్న౦లో చాలా సార్లు వాడిన జ౦ట అది. మీరు చ౦దమామ తారభామల జ౦టకు అతిచిన్న కవితలో ప్రాణ౦ పోసారు. అన్నట్టు, నేను రాసిన చీకటి అనే కవితలో నా మొదటి ప౦క్తి ఇదే. "నిజానికి చీకటి దాక్కు౦టు౦ది" కాని సన్నివేశ౦లో మహాతేడా ఉ౦దనుకో౦డీ. ఏది ఏమైనా ఇక చూస్తూ౦టాను మీ బ్లాగుని.
ప్రత్యుత్తరంతొలగించు@ నరేష్ గారూ! తప్పకుండా!
ప్రత్యుత్తరంతొలగించు@ ఆనంద్ గారూ! ధన్యవాదాలు. చందమామ, కలువభామ జంట ముచ్చటగొలపనిదెవరికి?
కాకపోతే తరచుగా కనిపిస్తూ కనువిందు చేసేది చందమామ, తారభామలేగా! ఏమంటారు?
ఆ.. అన్నట్టు
మీవంటి వీక్షకదైవాల కోసం నా బ్లాగులు ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతూనే ఉంటాయి.
కన్నులతో రాసుకున్న ప్రేమలేఖలే
ప్రత్యుత్తరంతొలగించుమిన్నంతా సాగెనెమో మేఘమాలలై
చాలా బావుంది.
శైలబాల గారు,
ప్రత్యుత్తరంతొలగించుఆసక్తిగా నా రాతల్ని చదివి మెచ్చుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండీ. అదీ వెన్నెల్లో గోదావరి అంత అందంగా వ్రాసే మీరు మెచ్చుకోవటం. వావ్!