Loading...

మంగళవారం 3 ఫిబ్రవరి 2009

కనుగొనవా ప్రియతమా!


కనుగొనవా ప్రియతమా!
నాకన్నుల కాంతిలో
మెరుపు నీవని
నా మూగ మనసులో రాగమే నీవని
నా ఆకాంక్షలో ఆర్తివైనావని
నా లక్ష్యం లో దిక్షవై ఉన్నవని



కనుగొనవా ప్రియతమా!
నా గుండియలో లయవని
నా నవ్వులలో దివ్వెలా
వెలుగుతున్నావని
నా శ్వాస లో వెచ్చదనం
నా చూపులో చల్లదనం
నీవేనని

కనుగొనవా ప్రియతమా!
నా కలల లోకానివని
కోరికల రూపానివని
నా భావాల్లో జీవానివని

కనుగొనవా ప్రియతమా!
నా భావ కడలికి నువు
పున్నమవని
నను భవ కడలి దాటిస్తావని
నా జీవాత్మలో పరమాత్మ
నీవె నీవెనని!!

-మందాకిని.

8 వ్యాఖ్యలు:

  1. కనుగొనవా ప్రియతమా!
    నా భావ కడలికి నువు
    పున్నమవని
    నను భవ కడలి దాటిస్తావని
    నా జీవాత్మలో పరమాత్మ
    నీవె నీవెనని!!

    చాలా బాగా రాశారు.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ధన్యవాదాలండీ!
    నా భావాలపై మీ స్పందనకు.

    ప్రత్యుత్తరంతొలగించు
  3. పరిమళ గారూ,
    కొంత కాలంగా అంతర్జాలానికి మా సిస్టంకీ ఏం గొడవొ తెలీదు. ఎడమొహం పెడమొహంగా ఉంటున్నాయి. ఒకవేళ చిత్రాలవల్లనేమోనని తీసివేశాను. అది కారణం కాదని తెలిసింది. ఇప్పుడు సమస్యా తీరిందిలెండి.

    ప్రత్యుత్తరంతొలగించు