నా మనసులో రాధ గురించి ఎన్నో ఆలోచనలు. వాటినన్నింటిని కాగితం మీద పెట్టకుండా ఉండలేకపోయాను. అది ఈ గీతమై నిలిచింది. ఇప్పుడు అన్నిభావనాతరంగాలను పదిలంగా దాచుకునేందుకు బ్లాగు అందుబాటులోకి వచ్చింది. ఇక ఇందులో రాయకుండా (టైపకుండా) ఉండగలనా?
ఒంటరి మనసు తుంటరి తోడు కోరుకున్నదిలే !
చల్లని రేయి మల్లెల వేళ వేచి ఉన్నదిలే ! ||ప||
ఉరమున వాలే కోరిక తీర్చగ చేర రమ్మనెలే !
కరముల మాలలు వాడక మునుపే వేగ రమ్మనెలే!
వెన్నెల లోన ఉల్లమునందున
ఆశలున్నవిలే ! ||ప||
కన్నుల కన్నీరొలికే దాకా జాగు చేయకుమా!
వెన్నల మనసుల మీద కొంచెం జాలి చూపుమా!
నిన్నే నమ్మిన నెచ్చెలి నొకపరి
చెంత చేర్చుమా! ||ప||
ఎల్లలు లేని ఆకస వీధుల సంచరించేదమా!
కలువల తోటల కాసారమ్ముల సాగిపోదామా!
నవ్వుల పువ్వులు విరిసే చోటికి
చేరుకుందామా! ||ప||
-మందాకిని.
*నిందతి చందన మిందు కిరణమని
ప్రత్యుత్తరంతొలగించువిందతి ఖేద మధీరం ..........
సావిరహే తవ దీనా రాధా .....
రాధ చిత్రం అద్భుతంగా ఉందండీ !
పరుగున రాడా మరి మాధవుడు !
రాధ కోసం మాధవుడు రాకుండా ఉండగలడా!
ప్రత్యుత్తరంతొలగించువిరహాన్ని జయదేవుడు సంస్కృతంలో అద్భుతంగా వర్ణించాడు.
ఏదో నాకు తోచిన స్థాయిలో, నాకు తెలిసినంత తెలుగులో నేను వర్ణించకుండా ఉండలేకపోయాను
ఫోటో చాలా బాగుంది. ఎక్కడ సేకరించారో తెలుపగలరా?
ప్రత్యుత్తరంతొలగించునా పాట గురించి మాత్రం ఎవరు రాయట్లేదు...వా(...............
ప్రత్యుత్తరంతొలగించుగూగులమ్మలొ బొమ్మల అన్వెషణలొ బొలెడన్ని బొమ్మలు.
హా హ హ ఒక పని చేయండి ఆ పాట పాడి రికార్డ్ చేసి దానిని బొమ్మ క్రింద పెట్టండి అసలు మీరు యే రాగం లో పాడుతూ ఈ పాట రాసారో మాకు అర్దం అవుతుంది .. పాట బాగుంది
ప్రత్యుత్తరంతొలగించుమందాకినిగారు,
ప్రత్యుత్తరంతొలగించుఫోటోకంటే మీ పాట అదుర్స్ అండి.. నిజ్జంగా చెప్తున్నాను.
నేస్తం గారూ,
ప్రత్యుత్తరంతొలగించుఅంత సీను లేదు లెండి. రాయడము గీయడము తప్ప పాడడం రాదు కాబట్టి బతికి పోయారు!
హ.. హ.. హ..! (నిజ్ఝం ! నాకు రాయడం వచ్చనే నా నమ్మకం మరి!)
జ్యొతి గారూ,
ప్రత్యుత్తరంతొలగించునిజం చెప్పనా! నా (సొంతదైనా) పాటలోనూ, దించుకున్న బొమ్మలోనూ భావం ఉంది కానీ, భావావేశం లేదని నాకు అనిపిస్తోంది.
బాగుందండి.
ప్రత్యుత్తరంతొలగించుఘట్టన అంటే గట్టిగా తాటించడం. పదఘట్టన అంటే గట్టిగా చప్పూడయ్యేలా కాళ్ళతో నేలని తన్నడం .. పైన మీరు రాసిన ఉద్దేశం బహుశా విరహ ఘట్టం అయి ఉంటుంది.
@పరిమళం .. నిందతి చందనం ఇందు కిరణం అనువిందతి ..
చెప్పడం మరిచాను. ఆ బొమ్మ ఒరిజినల్ గా ఇస్కాన్ వారి పుస్తకాల్లో ఉంటుంది.
ప్రత్యుత్తరంతొలగించుకొత్తపాళీ గారూ!
ప్రత్యుత్తరంతొలగించురెట్టింపు ధన్యవాదాలు. మీరు చెప్పినదే సరి. నేను గమనించలేదు. ఇప్పుడు సరి చేశాను.