Loading...

13, జనవరి 2009, మంగళవారం

సంక్రాంతి శుభాకాంక్షలు!!!

ముందుగా మన బ్లాగు మిత్రులందరికీవారి కుటుంబాలకూ సంక్రాంతి శుభాకాంక్షలు!!!

ఇప్పుడు ఇలా నగరాల్లో చేరి మరిచిపోయాం కానీ చిన్నప్పుడు మా పల్లెలో సంక్రాంతి అంటే ఎంత సంబరంగా ఉండేదో! అబ్బా అందరూ ఇదే రాస్తున్నారని చదివేవాళ్ళకు విసుగొస్తే రానీ గాక, మావూళ్ళో పండగ గురించి నేనూ రాసుకోక మానను. హ..హ..హ .


నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో....(చక్రాలు) చక్కగా 3 గంటలకంతా నిద్దర లేచి ఏడింటి వరకూ మా కాంపౌండ్ అంతా ముగ్గులతో నింపేసేదాన్ని.

ఆ నెలంతా ఒకటొ, రెండో వేసినా, భోగి, సంక్రాంతి,కనుమ ఈ3 రోజులు మాత్రం నాలుగు గంటలపాటు మా ఇంటి ముందు ముగ్గులతో నింపేసేదాన్ని.

బొర్నవిటా తాగుదువు గాని రామ్మా అని అమ్మ ఎంత పిలిచినా ముగ్గుల కార్యక్రమం అయ్యేదాకా వెళ్ళేది లేదు. రంగులు నింపితే ముగ్గుల అందాన్ని చూడలేమనే గొప్ప అభిప్రాయంతో రంగులు మాత్రం వేసే దాన్ని కాదు. ( తర్వాత ఈ తొక్కలో అభిప్రాయన్ని మార్చుకున్నాననుకోండి.)


క భో గి రోజు ఉదయన్నే తలంటుపోసుకుని పూజచేసుకుని అమ్మ చేసిన సద్ద రొట్టెలు గుమ్మడి కాయ కూర పులగం అందరూ కలసి (అన్నీ ఒకేసారి కాదు లెండి బాబూ) లాగించేవాళ్ళం.

సంక్రాంతి రోజు భక్ష్యాలు, చక్కెర పొంగలి,కొత్త బట్టలు, గోరింటాకు పెట్టుకోవడం, ఎవరి ముగ్గులు, గోరింటాకు బాగున్నాయో మాట్లాడుకోవడం3 ఏళ్ళ వయసు వరకూ పిల్లలకు భోగిపళ్ళు పోయడం(పుల్ల రేగుపళ్ళు,చెరుకుముక్కలు, బొరుగులు, పైసలు కలిపి పోస్తారు. తెలిసిన వాళ్ళను పేరంటానికి పిలుస్తారు.)

ఇంట్లో చుట్టాలు, వీధుల్లో హరిదాసులు, సాయంకాలం గుళ్ళోకెళ్ళటం, దేవుడి ఊరేగింపుల కోసం రథం అలంకారం అక్కడే ఉండి సహాయం చేస్తూ , రథంతో పాటు స్నెహితులతో కలిసి నడవటం, ఎవరి ఇల్లు రాగానే వాళ్ళు విడిపోవటం. ఇవన్నీ నా మధుర స్మృతులు .


10 వ్యాఖ్యలు:

  1. మీకుటుంబానిక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు

    ప్రత్యుత్తరంతొలగించు
  2. :) సంక్రాంతి శుభాకంక్షలు ..ఎంతమంది సంక్రాంతి మీద రాసినా నేను చదివాసా మీ టపా :) పూర్ణిమ గారి బ్లాగు నేను తెరువలేక పోతున్నా .. :)చాలా బాగా రాస్తారు ఆమె..

    ప్రత్యుత్తరంతొలగించు
  3. మీకూ.. మీ కుటుంబ సభ్యులకీ సంక్రాంతి శుభాకాంక్షలు..!

    పూర్ణిమ గారు బ్లాగును డిలీట్ చేయడం నాక్కూడా చాలా బాధగా ఉంది :(

    ప్రత్యుత్తరంతొలగించు
  4. నమస్కారమండీ:

    ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు!

    అనివార్య కారణాల వల్ల నా బ్లాగు తొలగించబడింది. మీకు అనుమతి లేదని వస్తుందే కానీ, నిజానికందులో ఏమీ లేదు. నేను బ్లాగును పునఃప్రారంభించిననాడు తప్పక తెలియజేస్తాను.

    My sincere apologies for the inconvenience being caused. I earnestly hope this proves to be a temporary glitch! And I thank you very sincerely for the interest in the blog.

    Best Wishes,
    Purnima
    (ఒక్కప్పటీ ఊహలన్నీ ఊసులై ;-))

    ప్రత్యుత్తరంతొలగించు
  5. మీకూ మీ కుటుంబానికీ.. సంక్రాంతి శుభాకాంక్షలు..!!

    ప్రత్యుత్తరంతొలగించు
  6. మీకూ మీ కుటుంబానికీ.. సంక్రాంతి శుభాకాంక్షలు..!!

    ప్రత్యుత్తరంతొలగించు
  7. మధురవాణిగారూ, ధన్యవాదములు.
    పూర్ణిమగారి స్పందన చూశారనుకుంటాను.

    దుర్గేశ్వర గారూ, ధన్యవాదములు .

    పూర్ణిమగారూ,స్పందించినందుకు ధన్యవాదములు.
    త్వరలో కలుసుకుంటామని ఆశిస్తాను.

    ఆత్రేయగారూ, మరి మరి ధన్యవాదములు.

    ప్రత్యుత్తరంతొలగించు