Loading...

5, జనవరి 2009, సోమవారం

మందార మకరందమును....

పుస్తకాలు చదివేటప్పుడు ఓ కొత్త ప్రపంచం లోకి వెళ్ళటం అనే అనుభూతి చాలా గొప్పది. అది నా లాంటి పుస్తకాల పురుగులకే తెలుస్తుంది.

మధ్యలో పుస్తకాలు (కనీసం వారపత్రికలు కూడా) చదవటం తగ్గించుకున్నాను. తర్వాత టి.వి. ప్రభావం వల్ల చదివే ఓపిక తగ్గిపోయింది.

ఇప్పుడు బ్లాగ్లోకం లోకి వచ్చి పడ్డాక మళ్ళీ ఖాళీ అయిన కలంలో సిరా నింపినట్టుగా (జీవం వచ్చినట్టుగా) అయింది. మనం రాసే కాలక్షేపం కబుర్లు చదువుతున్నపుడే ఇంత ఆనందమేమిటో! పుస్తకాలు చదవటం, బొమ్మలు గీయడం, రాయడం అన్నిటికి సంసార మహా సాగరంలో పడి బొత్తిగా దూరం అయిపోయాను.

నా బ్లాగులోకి ఇంకా ఎవరూ తొంగి కూడా చూడనప్పటికీ,నేను మాత్రం ప్రతిరోజూ బ్లాగ్దర్శనం చేసుకుంటూ బహు ఆనందం పొందుతున్నాను.

"మందార మకరంద మాధుర్యమును గ్రోలు..." అన్నట్లు ఇక టి.వి. సీరియళ్ళ మీద ఆసక్తి ఠక్కున మాయమయ్యింది. ఫోన్ల పుణ్యమాని ఉత్తరాలు కూడా మానుకున్నాక షాపింగ్ లిస్ట్ తప్ప ఏదీ రాయకుండా ఎలా ఉంటున్నానో ఇన్నాళ్ళూ అనిపించింది.

అయినా బొత్తిగా కలం పట్టకుండా లేను. కొన్ని దేవుని పాటలు, పల్లె పదాలు, విరహగీతాలు గెలికి ఆట్టే పెట్టాను.

అవన్నీ ఇప్పుడు నా బ్లాగులో కనిపిస్తుంటే పరమానందంగా ఉంది.

ఇక జనామోదానికి నోచుకున్న గొప్ప గొప్ప కావ్యాలు, గ్రంథాలు వ్రాసిన వాళ్ళ ఆనందం ఎలా ఉంటుందో కదా!

2 వ్యాఖ్యలు:

  1. బాగుందండి,బ్లాగులోకంలోకి స్వాగతం.
    అభ్యాసము కూసువిద్య
    పుస్తకాలు చదివినట్లే బ్లాగులూ రాయండి
    అప్పుడు మేము మీబ్లాగులను పుస్తకాలు చదివినట్లు చువుతాము,:)

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ధన్యవాదాలు రాజేంద్రకుమార గారూ,మీరు బ్లాగులో నా రచనకు మొదట స్పందించి ప్రోత్సహించడం ఎప్పుడూ మరువను.

    ప్రత్యుత్తరంతొలగించు