Loading...

22, డిసెంబర్ 2008, సోమవారం

మిల మిల మెరిసే చక్కని తార !!

ఎల్లలు లేని ఆకసమిల్లుగ
పిల్లల మనసుల ఆసలు చేరగ
మిన్నుల నంటగా ఫై ఫై కెదగగ
మిల మిల మెరిసే చక్కని తార !!

జాబిలి శోభను మరి మరి పెంచగ
అమవస నిశికీ వేగిరమ్మున
నింగికి తళతళ హంగులు అమరగ
మిల మిల మెరిసే చక్కని తార !!

బారులు తీరిన విద్యుత్ తారలు
లెక్కకు మరి సిద్ధము పోరుకు
డెందము నందున మోదము నింపగ
నిను ఓడింపగా జాలునే దమ్ములు

మిల మిల మెరిసే చక్కని తార !!
మిల మిల మెరిసే చక్కని తార !!
-మందాకిని

21, డిసెంబర్ 2008, ఆదివారం

నాకు నచ్చిన బ్లాగులు

 1. జ్యోతి
 2. రాధిక
 3. సుజాత
 4. విహారి
 5. సత్యం శివం సుందరం
 6. కౌముది
 7. కళా స్ఫూర్తి
 8. ఆణిముత్యాలు

 9. మా అబ్బాయి బ్లాగ్
 10. పూర్ణిమ
 11. రమణి

ఆనందమానందమాయెనే!

ఇవాళ నాకెంతో సంతోషంగా ఉంది. నా సొంత బ్లాగులో మొట్టమొదటి టపా ఇది.