Loading...

30, డిసెంబర్ 2008, మంగళవారం

ఏవో ఊహలు

ఎవరూ లేని ఏకాంతంలో
ధ్యానంలో
ప్రకృతి గానంలో
మౌనంలో
మానస సంచారం

మనసు సంచరించు వేళలో
మది మాటలాడు హేలలో
కనుల జలకాల లీలలో
ఏదో శాంతి దిగంతాలందుకునే మనభ్రాంతి
ఎంత ఎగసినా అంబరాన్ని చేరలేని అలలు
ఎంత మెరిసినా సంబరాన్ని చూడలేని కలలు

కనుపాపలాడే కన్నీటి జలకాల
కరిగేటి కలలన్నీ లవణాలధార
మదిఓపలేని మనభారమంతా
సహవాసమొదలి ననువీడిపోయె

ప్రేమరాహిత్యంలో బ్రతికి
ప్రేమరాహిత్యంలో మరణించగా
జీవములేని మనసు డొల్ల
అణగారిపోయెను ఆశలెల్ల
అడుగంటి పోయెను మరులెల్ల
-మందాకిని.

2 వ్యాఖ్యలు:

 1. కనుపాపలాడే కన్నీటి జలకాల
  కరిగేటి కలలన్నీ లవణలధార
  ఎంతో కరెక్ట్ గా చెప్పారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శైల బాల గారు,
  మూడేళ్ళక్రితం రాసిన రాతల్ని గుర్తు చేసి నా మనసు కదిలించారు.
  మీకు కృతజ్ఞురాలిని.

  ప్రత్యుత్తరంతొలగించు